ఈరోజే రియల్మీ X50 ప్రో 5G మొదటి సేల్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 24 Feb 2020
HIGHLIGHTS

మొట్టమొదటి 5G స్మార్ట్ ఫోన్ను చేజిక్కుంచుకోవడానికి ఎదురుచూస్తున్న వారికీ సదావకాశం.

ఈరోజే రియల్మీ X50 ప్రో 5G మొదటి సేల్
ఈరోజే రియల్మీ X50 ప్రో 5G మొదటి సేల్

Vostro 3501

Popular tech to stay connected anywhere. Save more on exciting Dell PCs.

Click here to know more

Advertisements

ఇండియాలో కొత్త తరం స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన ఘనత రియల్మీ సంస్థకు దక్కింది. ఎందుకంటే, రియల్మీ తన X50 ప్రో 5G స్మార్ట్ ఫోన్ను ఈరోజు ఇండియాలో విడుదల చెయ్యడంతో ఈ ఘనత సాధించింది. అంతేకాదు, ఈ ఫోన్ను అనేకమైన గొప్ప ప్రత్యేకతలతో పాటుగా సరసమైన ధరలో విడుదల చేసింది మరియు ఈ విభాగంలో ముందునుండే అగ్రస్థానంలో కొనసాగుతున్న చాలా ఫోన్లకు నేరుగా పోటీగా మారనుంది. ఈ ఫోన్ను ఈరోజు విడుదల చెయ్యడమే కాకుండా, ఇదే దీని మొదటి ఫ్లాష్ సేల్ ని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈరోజు సాయంత్రం 6 గంటలకి Flipkart మరియు Realme.com నుండి మొదవుతుంది. మొట్టమొదటి 5G స్మార్ట్ ఫోన్ను చేజిక్కుంచుకోవడానికి ఎదురుచూస్తున్న వారికీ  సదావకాశం.  

రియల్మీ X50 ప్రో 5G : ధరలు

1. Realme X50 Pro 5G : 6GB ర్యామ్  + 64GB స్టోరేజి : Rs.37,999/-

2. Realme X50 Pro 5G : 8GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.39,999/

3. Realme X50 Pro 5G : 12GB ర్యామ్ + 256GB స్టోరేజి : Rs.44,999/

రియల్మీ X50 ప్రో 5G : ప్రత్యేకతలు

ఈ X50 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ఒక 6.44 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేని 3D AG కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ప్రొటెక్షన్ తో మరియు 20:9 ఆస్పెక్ట్ రేషియాతో తీసుకువచ్చింది. ఇందులో, డ్యూయల్ ఇన్ డిస్ప్లే కెమేరా (పంచ్ హోల్)తో పాటుగా AG గ్లాస్ టెక్నాలజీతో అందించింది. ఇది ఇక దీని డిస్ప్లే యొక్క స్పెషల్ ఫీచర్ విషయానికి వస్తే, ఇది HDR 10+ కి సపోర్ట్ చేయగల 90Hz డిస్ప్లేతో వస్తుంది. అంతేకాదు, ఇది 100% DCI-P3 మరియు 105% NTSC కలర్ గాముట్ తోపాటుగా 1000+ నిట్స్ బ్రైట్నెస్ వంటి గోప్ప ఫీచర్లతో వస్తుంది.                                             

ఇది క్వాల్కామ్ యొక్క అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ అయినటువంటి, క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 865 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది A77 పెరఫార్మెన్స్  కోర్స్ తో గరిష్టంగా 2.84GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. PUBG వంటి గేమింగ్ అల్ట్రా హై డెఫీనేషనుతో పాటుగా ఎటువంటి అంతరాయం లేకుండా గంటల తరబడి ఆడవచ్చు.  ఈ స్మార్ట్ ఫోనులో అందించిన 5 డైమాన్షనల్ వేపర్ కూలింగ్ టెక్నలాజితో ఈ ఫోన్ను నిరంతరం చల్లగా ఉంచుతుంది. దీని విశేషం ఏమిటంటే, ఇది ఫోన్ను వేడికాకుండా చల్లబరచడంలో మంచి పాత్ర వహిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది 5G సపోర్టుతో వస్తుంది మరియు ఇది ఇండియాలో విడుదలైన మొట్ట మొదటి 5G స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది.   

ఈ ఫోన్ను మూడు ర్యామ్ వేరియంట్ ఎంపికలతో ప్రకటించింది. అవి : 6GB ర్యామ్ +64GB స్టోరేజి, 6GB ర్యామ్ +128GB మరియు 8GB + 256GB స్టోరేజి వంటి రెండు వేరియంట్లు . వీటి ధరలు ఈ క్రింద చూడవచ్చు. అంతేకాదు, ఇది వేగవంతమైన LPDDR5 RAM మరియు UFS 3.0   

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ ఫోనులో వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును అందించింది. ఈ క్వాడ్ కెమెరాలో, f/1.8 ఎపర్చర్ కలిగిన ఒక 64MP ప్రధాన కెమెరాని Samsung ISOCELL GW1 సెన్సారుతో ఇంచింది. ఇక రెండవ కెమేరా గురించి చూస్తే, ఇది ఒక f/2.3 అపర్చరు కలిగిన 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మీకు మ్యాక్రో ఫోటోలను కూడా తియ్యడానికి వెలుపడుతుంది. దీనికి జతగా 12MP టెలిఫోటో లెన్స్ (20Xజూమ్) మరియు నాలుగవ కెమేరాగా ఒక 2MP బ్లాక్ %& వైట్ పోర్ట్రైట్ సెన్సార్ ని కలిగి ఉంటుంది.  ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 32MP Sony IMX616 సెన్సార్ మరియు 8MP సూపర్ వైడ్ యాంగిల్ సెన్సార్లు జతగా గల డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ కెమేరాతో మీరు సూపర్ సెల్ఫీ ఫోటోలు మరియు 120fps తో  స్లో మోషన్ వీడియోలను తీయ్యోచ్చు మరియు ఫోటోలను అద్భుతంగా చిత్రీకరించవచ్చు.

ఈ రియల్మీ X50 ప్రో 5G ఒక అతిపెద్ద 4,200mAh బ్యాటరీతో విడుదల చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని అత్యంత వేగవంతమైన 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా, బాక్స్ లోనే ఒక 10V/6.5A ఛార్జర్ కూడా అందించింది. ఈ అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 20 నిముషాల్లో 60% వరకూ బ్యాటరీని ఛార్జ్ చెయ్యొచ్చు మరియు కేవలం 35 నిముషాల్లోనే ఫోన్ను పూర్తిగా ఛార్జ్ చెయ్యొచ్చు. ఇక ఇందులో అందించిన సౌండ్ టెక్నాలజీ గురించి చూస్తే, ఇందులో  డ్యూయల్ సూపర్ లైనర్ డ్యూయల్ స్పీకర్లను DOLBY ATMOS సరౌండ్ మరియు Hi-Res సౌండ్  టెక్నలాజిని అందించారు.        

Realme X50 Pro 5G Key Specs, Price and Launch Date

Price:
Release Date: 24 Feb 2020
Variant: 128GB6GBRAM , 256GB12GBRAM
Market Status: Launched

Key Specs

  • Screen Size Screen Size
    6.44" (1080x2400)
  • Camera Camera
    64 + 8 + 12 + 2 | 32 + 8 MP
  • Memory Memory
    256 GB/12 GB
  • Battery Battery
    4200 mAh
logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status