REALME X2 PRO విడుదల : హై ఎండ్ ఫీచర్లతో లాంచ్ అయ్యింది

REALME X2 PRO విడుదల : హై ఎండ్ ఫీచర్లతో లాంచ్ అయ్యింది
HIGHLIGHTS

REDMI K 20 Pro కు చాలా కఠినమైన పోటీని ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

రియల్మీ సంస్థ, తన మొట్టమొదటి ఫ్లాగ్‌ షిప్ మొబైల్ ఫోనుగా REALME X 2 Pro ను లాంచ్ చేసింది. కంపెనీ, ఈ మొబైల్ ఫోన్ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ ఫోనుగా లాంచ్ చేయబడినా కూడా ఇది కేవలం మిడ్-రేంజ్ విభాగంలో కంపెనీ విడుదల చేసిన మొట్టమొదటి మొబైల్ ఫోనుగా ఉంటుంది. ఈ ధర వద్ద, ఈ మొబైల్ ఫోన్ REDMI K 20 Pro కు చాలా కఠినమైన పోటీని ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే, ఈ మొబైల్ ఫోన్ను చైనాలో లాంచ్ చేయడానికి ముందు, ఈ మొబైల్ ఫోన్ను డిసెంబర్ నెలలో భారత మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

రియల్మి ఎక్స్ 2 ప్రో లాంచ్ : ప్రత్యేకతలు మరియు చైనాలో ధరలు

రియల్మి ఎక్స్ 2 ప్రో మొబైల్ ఫోన్ మూడు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లలో విడుదల చెయ్యబడింది. దీని యొక్క ప్రత్యేక ఎడిషన్ కూడా ప్రారంభించబడింది. ఈ మొబైల్ ఫోన్ యొక్క 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్‌ను కంపెనీ ఆర్‌ఎమ్‌బి 2,599 ధరతో లాంచ్ చేసింది, అంటే సుమారు రూ .25,990, ఇది కాకుండా, దాని 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ మోడల్‌ను ఆర్‌ఎమ్‌బి 2,799 ధరతో లాంచ్ చేశారు, అంటే సుమారు 27,990 రూపాయలు.  ఇది కాకుండా, దాని 12 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్ మోడల్‌ను ఆర్‌ఎమ్‌బి 3,199 ధరతో లాంచ్ చేశారు, అంటే సుమారు రూ .31,990. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్ యొక్క మాస్టర్ ఎడిషన్ 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్‌తో ఆర్‌ఎంబి 3,299 ధరతో లాంచ్ చేయబడింది, అంటే సుమారు 32,990 రూపాయలు.

ఈ మొబైల్ ఫోన్ అంటే రియల్మీ ఎక్స్ 2 ప్రో ఫ్లాగ్‌ షిప్ మొబైల్ ఫోన్ లాగా లాంచ్ అయిందని  చెప్పినట్లుగా, ఈ మొబైల్ ఫోన్‌లో  క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ చిప్‌ సెట్ ఇవ్వబడింది. ఇది కాకుండా, మీరు ఈ మొబైల్ ఫోన్‌లో ఒక 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను పొందుతారు. అంతేకాదు, ఈ డిస్ప్లేని FHD + రిజల్యూషన్‌తో పొందనున్నారు. ఈ మొబైల్ ఫోన్‌లో, మీరు వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 7 టి మరియు వన్‌ప్లస్ 7 టి ప్రో మొబైల్ ఫోన్‌ల మాదిరిగానే 90 Hz రిఫ్రెష్ రేట్‌ స్క్రీన్‌ను అందుకుంటారు మరియు  ఇది లిక్విడ్ కూలింగ్ ఫీచర్‌తో వస్తుంది. ముఖ్యంగా, ఇది ఒక 4000mAh సామర్థ్యం గల బ్యాటరీని 50W VOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజితో తీసుకొచ్చింది.

కెమెరా మొదలైన వాటి గురించి మాట్లాడితే, ఈ మొబైల్ ఫోన్‌లో మీకు క్వాడ్-కెమెరా సెటప్ లభిస్తోంది, ఇందులో మీకు 64 MP  ప్రధాన కెమెరా లభిస్తోంది, ఇది కాకుండా మీరు 8MP  అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ తో పాటుగా  ఒక 13MP టెలిఫోటో లెన్స్‌తో పాటు 2MP డెప్త్ సెన్సార్‌ను కూడా పొందుతున్నారు. ఇది కాకుండా, మీరు ఫోన్‌లో ఇన్ డిస్ప్లే వేలిముద్ర సెన్సార్‌ను కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo