Realme X2 సూపర్ ఫీచర్లతో మిడ్ రేంజ్ ధరలో విడుదలయ్యింది.
ఈరోజు జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా రియల్మీ తన Realme X2 స్మార్ట్ ఫోన్ మరియు రియల్మీ బడ్స్ ఎయిర్ ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ రియల్మీ X2 ను 64MP క్వాడ్ కెమెరాతో మరియు స్నాప్ డ్రాగన్ 730G గేమింగ్ ప్రాసెసర్ తో అందుబాటులోకి ఉంచింది. వాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలను చూసినట్లయితే, దాదాపుగా Realme XT మాదిరిగానే అనిపిపిస్తుంది. కేవలం ప్రాసెసర్ పరంగా ఇందులో మార్పులు కనిపిస్తాయి దానికి తగిన విధంగా కెమేరా మరియు గేమింగ్ ఫీచర్లలో మెరుపులు గమనించవచ్చు.
SurveyRealme X2 ధరలు
1. Realme X2 (4GB + 64GB) ధర – Rs.16,999
2. Realme X2 (6GB + 128GB) ధర – Rs.18,999
3. Realme X2 (8GB + 128GB) ధర – Rs.19,999
ఇక సేల్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ డిసెంబర్ 20 తేదికి జరగనుంది.
Realme X2 : ప్రత్యేకతలు
Realme X2 స్మార్ట్ ఫోన్ ఒక మిడ్-రేంజ్ హ్యాండ్‌సెట్ గా ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది గరిష్టంగా 2.2 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730G SoC యొక్క శక్తిని కలిగి ఉంది మరియు ఒక 6.4-అంగుళాల Full HD + Super AMOLED డిస్ప్లేని 91.9 శాతం స్క్రీన్ టూ బాడీ నిష్పత్తితో కలిగి ఉంది. ఈ డిస్ప్లేలో వాటర్‌డ్రాప్ నోచ్ డిజైన్ ఉంది, ఇందులో సెల్ఫీ కెమెరా ఉంచబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్, వెనుక ఒక ప్రత్యేకమైన 3D గ్లాస్ డిజైన్ కలిగి ఉంది, ఇది పెరల్ గ్రీన్, పెరల్ బ్లూ మరియు పెరల్ వైట్ కలర్ ఎంపికలతో వస్తుంది.
ఆప్టిక్స్ పరంగా, రియల్మి X2 వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఇది f / 2.25 ఎపర్చరు లెన్స్ మరియు 119 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో ఒక 8 ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కలిగి ఉంటుంది. దీనికి జతగా 64MP ప్రాధమిక సెన్సార్ తో పాటు, F / 2.4 లెన్స్‌తో 2MP పోర్ట్రెయిట్ లెన్స్ మరియు f / 2.4 మాక్రో లెన్స్‌తో 2MP కెమెరా కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్, మెరుగైన Low -Light చిత్రాలను కూడా అందిస్తుంది. ముందు భాగంలో 32MP సెన్సార్, ఒక f / 2.0 ఎపర్చర్‌తో ఉంటుంది.
రియల్మీ X2 గరిష్టంగా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ లో హైపర్‌బూస్ట్ 2.0 అమర్చారు, ఇది గేమింగ్ ఆడేటప్పుడు మరింత మధురానుభూతిని అందిస్తుంది. అలాగే, ఒక 4000mAh బ్యాటరీతో మద్దతు ఉన్నఈ హ్యాండ్‌సెట్ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది మరియు 30 వాట్స్ VOOC 4.0 ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. ఈ VOOC ఛార్జింగ్ 70 నిమిషాల్లో హ్యాండ్‌సెట్ బ్యాటరీని 100 శాతం నింపుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
