Realme X ఫ్లాష్ సేల్ :48MP, పాప్ అప్ సెల్ఫీ, చౌక ధర మరిన్ని విశేషాలు

HIGHLIGHTS

ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 48MP డ్యూయల్ కెమేరా వంటి గొప్ప ప్రత్యేకతలతో ఉంటుంది.

Realme X ఫ్లాష్ సేల్ :48MP, పాప్ అప్ సెల్ఫీ, చౌక ధర మరిన్ని విశేషాలు

రియల్మీ సంస్థ ఇండియాలో విడుదల తాజాగా కేవలం రూ.16,999 ప్రారంభదరతో అనేక గొప్ప ఫీచర్లను కలిగిన రియల్మీ X స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్, ఒక పాప్ సెల్ఫీ, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 48MP డ్యూయల్ కెమేరా వంటి గొప్ప ప్రత్యేకతలతో ఉంటుంది. ఈ రియల్మీX యొక్క మరొక ఫ్లాష్ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart నుండి మొదలవుతుంది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

REALME X ధరలు

1. రియల్మీ X  (4GB + 64GB ) ధర – Rs. 16,999

2. రియల్మీ X  (8GB + 128GB ) ధర – Rs. 19,999       

REALME X ప్రత్యేకతలు

రియల్మీ సంస్థ ఈ స్మార్ట్ ఫోనులో 6.53 అంగుళాల FHD+  శామ్సంగ్ యొక్క సూపర్ AMOLED డిస్ప్లేను ఇందులో అందించింది. అలాగే, ఇందులో ఎటువంటి నోచ్ డిజైన్ లేకుండా పూర్తి స్క్రీన్ తో దీన్ని అందించింది. అంతేకాదు, ఈ డిస్ప్లేలో ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారును కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 4GB /8GB మరియు హై ఎండ్ వేరియంట్ 8GB శక్తితో పనిచేస్తుంది. అలాగే, 64GB మరియు 128GB స్టోరేజి ఎంపికలతో లభిస్తుంది. అధనంగా, వేగవంతమైన ఛార్జింగ్ కోసం ఒక 20వాట్స్ VOOC 3.0 ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలిజీతో కూడిన 3,750 mAh బ్యాటరీతో వస్తుంది.

ఇక కెమేరాల విభాగానికి వస్తే, ఇందులో ప్రధాన కెమేరాని ఒక 48MP Sony IMX586 సెన్సారు కి జతగా 5MP కెమేరాని కలిపి డ్యూయల్ రియర్ కెమేరా సెటప్పుతో అందించింది. ముందు  ఒక 16MP సోనీ IMX 471 సెన్సార్ పాప్ అప్ సెల్ఫీ కెమెరాని ఇందులో ఇచ్చింది. అలాగే, గేమింగ్ కోసం హైపర్ బూస్ట్ 2.0 ని ఇందులో ఇచ్చింది. పోలార్  వైట్ మరియు స్పేస్ బ్లూ వంటి రంగులలో లభించనుంది. అధనంగా, Dolby Atmos టెక్నాలజీతో ఈ స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది. కాబట్టి, పూర్తి హై క్వాలిటీ సౌండ్ ఈ స్మార్ట్ ఫోన్ సొంతం అనిచెప్పొచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo