రియల్మీ సంస్థ, గొప్ప అంచనాలతో తీసుకురానున్న REALME X గురించి రోజుకొక టీజింగుతో అదరగొడుతోంది. వాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో ముందుగా విడుదలైనప్పటి, ఇండియా వేరియంట్ మాత్రం అనేకమైన మార్పులతో వస్తుందని కంపెనీ చెప్పడంతో, రానున్న ఈ ఫోన్ పైన అనేక అంచనాలను వేస్తున్నారు. రియల్మీ యొక్క అధికారిక ట్విట్టర్ పేజీలో ప్రస్తుతం తాజాగా అందించిన టీజ్ ప్రకారం, ఈ రియల్మీ X స్మార్ట్ ఫోన్ DOLBY ATMOS సౌండ్ టెక్నాలజీతో రానున్నట్లు తేటతెల్లమయ్యింది.
అలాగే, ముందుగా అందించిన కొన్ని టీజింగుల ప్రకారం, ఈ ఫోను యొక్క డిస్ప్లే ను గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇంకా, VooC Flash Charge 3.0 టెక్నాలజీ, మరియు గొప్ప గ్రాఫిక్స్ కోసం HyperBoost 2.0 మరియు పాప్ అప్ సెల్ఫీ కలిగిన గొప్ప డిజైన్ మరియు బలమైన బాడీ తో తీసుకురానున్నట్లు రూఢి అవుతోంది.
ఇక కెమేరాల విషయానికి వస్తే, ఇందులో కూడా పైచేయిగా ఉండేలా గొప్ప సామర్ధ్యం కలిగిన 48MP Sony IMX586 సెన్సార్ మరియు దానికి జతగా ఒక 5MP డెప్త్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమేరాని, ఇందులో అందించినట్లు సూచిస్తోంది. అయితే, రానున్న ఈ రియల్మీ X యొక్క ధరను ఇంచుమించు 18,000 రూపాయలకు దగ్గరగా ఉండేలా తేనున్నట్లు ప్రకటించిన ప్రకారంగా చూస్తే, ఈ ఫోన్ అల్ రౌండ్ మిడ్ రేంజ్ ఫోనుగా వస్తుంది. కానీ, దీని ప్రత్యేకతలు ప్రకారంగా చూస్తే మాత్రం ఇది ప్రిమియం ఫోన్లలో ఉండే ప్రత్యేకతలతో ఉండనుంది.