Realme X మరియు 3i కొనడానికి మరొక సదవకాశం : ఫ్లాష్ సేల్ మధ్యాహ్నం 12 గంటలకి
రియల్మీ X మరియు రియల్మి 3i యొక్క ఫ్లాష్ సేల్ మరొక్కసారి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది.
ఇటీవలి కాలంలో కేవలం బడ్జెట్ మరియు మిడ్ రేంజ్ ధర పరిధిలో తీసుకొచ్చినటువంటి, రియల్మీ X మరియు రియల్మి 3i యొక్క ఫ్లాష్ సేల్ మరొక్కసారి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది. ఈ రియల్మీ X, ఒక పాప్ సెల్ఫీ, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 48MP డ్యూయల్ కెమేరా వంటి గొప్ప ప్రత్యేకతలతో, రియల్మీ సంస్థ ఇండియాలో కేవలం రూ.16,999 ప్రారంభదరతో ఉంటుంది. అలాగే, రియల్మీ 3i గ్రేడియంట్ కలర్ డిజైన్ డ్యూయల్ కెమేరాలతో బడ్జెట్ ధరలో ఉంటుంది.
SurveyREALME X ధరలు
1. రియల్మీ X (4GB + 64GB ) ధర – Rs. 16,999
2. రియల్మీ X (8GB + 128GB ) ధర – Rs. 19,999
Realme 3i ధరలు
1. Realme 3i (3GB ర్యామ్ + 32 GB స్టోరేజి) ధర – Rs. 7,999
2. Realme 3i (4GB ర్యామ్ + 64 GB స్టోరేజి) ధర – Rs. 9,999
REALME X ప్రత్యేకతలు
రియల్మీ సంస్థ ఈ స్మార్ట్ ఫోనులో 6.53 అంగుళాల FHD+ శామ్సంగ్ యొక్క సూపర్ AMOLED డిస్ప్లేను ఇందులో అందించింది. అలాగే, ఇందులో ఎటువంటి నోచ్ డిజైన్ లేకుండా పూర్తి స్క్రీన్ తో దీన్ని అందించింది. అంతేకాదు, ఈ డిస్ప్లేలో ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారును కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 4GB /8GB మరియు హై ఎండ్ వేరియంట్ 8GB శక్తితో పనిచేస్తుంది. అలాగే, 64GB మరియు 128GB స్టోరేజి ఎంపికలతో లభిస్తుంది. అధనంగా, వేగవంతమైన ఛార్జింగ్ కోసం ఒక 20వాట్స్ VOOC 3.0 ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలిజీతో కూడిన 3,750 mAh బ్యాటరీతో వస్తుంది.
ఇక కెమేరాల విభాగానికి వస్తే, ఇందులో ప్రధాన కెమేరాని ఒక 48MP Sony IMX586 సెన్సారు కి జతగా 5MP కెమేరాని కలిపి డ్యూయల్ రియర్ కెమేరా సెటప్పుతో అందించింది. ముందు ఒక 16MP సోనీ IMX 471 సెన్సార్ పాప్ అప్ సెల్ఫీ కెమెరాని ఇందులో ఇచ్చింది. అలాగే, గేమింగ్ కోసం హైపర్ బూస్ట్ 2.0 ని ఇందులో ఇచ్చింది. పోలార్ వైట్ మరియు స్పేస్ బ్లూ వంటి రంగులలో లభించనుంది. అధనంగా, Dolby Atmos టెక్నాలజీతో ఈ స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది. కాబట్టి, పూర్తి హై క్వాలిటీ సౌండ్ ఈ స్మార్ట్ ఫోన్ సొంతం అనిచెప్పొచ్చు.
Realme 3i ప్రత్యేకతలు
ఈ రియల్మీ 3i వెనుక భాగంలో ఒక డ్యూయల్ రియర్ కెమేరాతో వస్తుంది. అలాగే, ఈ Realme 3i స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ట్రెండీగా నడుస్తున్న, గ్రేడియంట్ కలర్ తో కూడా కలిగి ఉంటుంది. ఈఫోన్ వెనుక 13MP+ 2MP సెన్సారులు కలిగిన డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ ముందభాగంలో ఒక 13MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది డైమండ్ బ్లూ, డైమండ్ రెడ్ మరియు డైమండ్ బ్లాక్ వంటి మూడు కలర్ ఎంపికలతో వస్తుంది.
పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఒక మీడియా టెక్ హీలియో P60 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు జతగా 3GB /4GB శక్తితో వస్తుంది. అలాగే, ఇందులో అందించిన డిస్ప్లే ఒక 6.22 అంగుళాల పరిమాణం కలిగిన HD+ రిజల్యూషనుతో వస్తుంది. ఇది Color 6.0 OS తో ఆండ్రాయిడ్ 9 పై తో నడుస్తుంది. ఇది ఒక పెద్ద 4,230 mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ ఫోన్ను డైమండ్ కట్ డిజైనుతో మరియు తక్కువ బరువుతో తీసుకోచ్చింది.