రియల్మీ 64MP కెమేరా ఫోన్ టీజింగ్ ఇమేజి వచ్చేసింది
ఈ క్వాడ్ కెమేరా సెటప్పులో ఒక 4CM macro కెమేరాని కూడా ఆంధిచినట్లు తెలిపారు.
ఇప్పుడు, రియల్మి నుండి అతిత్వరలో రానున్న 64-మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ గురించిన మరొక కొత్త సమాచారం ఇటీవల బయటికి వచ్చింది. నివేదికల ప్రకారం, ఈ ఫోన్ రియల్మి 5 లేదా రియల్మి 5 ప్రో పేరుతో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటీవలి నివేదికల ప్రకారం, ఈ ఫోన్ యొక్క వెనుక ప్యానెల్ ద్వారా ఇది రియల్మి 5 లేదా రియలల్మి 5 ప్రో గా పిలవవచ్చని ఆరోపించబడింది.
Surveyకంపెనీ యొక్క CEO మాధవ్ శేత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రియల్మి 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ యొక్క ఒక టీజ్ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ఫోటో, ఫోన్ వెనుక ప్యానెల్ గురించి చూపిస్తుంది. ఈ ఇమేజిలో, ఒక కేసు ద్వారా ఈ ఫోన్ కప్పబడి ఉంటుంది. ఇది కెవస్ చేత కవర్ చేయబడింది. దీనితో పాటు, ప్రత్యేకత ఏమిటంటే, ఫోన్ వెనుక భాగంలో భద్రత కోసం వేలిముద్ర సెన్సార్ లేదు. అంటే, ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుండవచ్చు.
Get ready for the world's first hands-on experience of #64MP Quad Camera on a smartphone, tomorrow at the #realme camera innovation event. Stay Real, No Hype. #LeapToQuadCamera pic.twitter.com/TBEFd84OIV
— Madhav '5'Quad (@MadhavSheth1) August 7, 2019
అధనంగా ఈ ఫోన్ ఒక 64MP ప్రధాన సెన్సార్ తో పాటుగా మరొక మూడు కెమెరాలను కలగలిపిన క్వాడ్ కెమేరా సెటప్పుతో కనిపిస్తుంది. అలాగే, ఈ కెమేరాకి ప్రక్కవైపున ఒక LED ఫ్లాష్ కూడా అందించారు. మరొక ట్వీట్ నుండి ఈ క్వాడ్ కెమేరా సెటప్పులో ఒక 4CM macro కెమేరాని కూడా ఆంధిచినట్లు తెలిపారు. అంటే, ఈ కెమేరాతో చాల చిన్న వాటిని కూడా చాలా చక్కని క్లారిటీతో ఫోటో తీసుకునే వీలుంటుంది.