లాంచ్ కంటే ముందే Realme X2 Pro ను బుక్ చేసుకోండి : ఈ రోజు నుండి బ్లైండ్ ఆర్డర్ మొదలు

లాంచ్ కంటే ముందే Realme X2 Pro ను బుక్ చేసుకోండి : ఈ రోజు నుండి బ్లైండ్ ఆర్డర్ మొదలు
HIGHLIGHTS

ఈ రోజు నుండి బ్లైండ్ ఆర్డర్ మొదలుపెట్టింది.

రియల్మీ సంస్థ ఈ 20 వ తేదిన ఇండియాలో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లను సిధ్దం చేసింది. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ యొక్క కొత్త అప్డేట్ ను విడుదలకి చేసింది. అదేమిటంటే, ఈ లాంచ్ కంటే ముందుగానే ఈ రోజు నుండి బ్లైండ్ ఆర్డర్ మొదలుపెట్టింది. అంటే, ఈ ఫోన్ కొనదలచిన వారు కేవలం రూ. 1,000 చెల్లించి దీన్ని ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. అటుతరువాత, 20 లేదా 21 తారిఖుల్లో మిగిలిన డబ్బును చెల్లించి ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. అంటే, ఫ్లాష్ సేల్ కోసం ఎదురు చూసే పనిలేకుండా ఈ ఫోన్ను మీరు అందుకోవచ్చన్నమాట.

అయితే, ఈ అవకాశం కేవలం ముందుగా బ్లైండ్ ఆర్డర్ చేసిన 855 కొనుగోలుదారులకు మాత్రమే దక్కుతుంది. ముందుగా, ఈ బ్లైండ్ ఆర్డర్ చేసిన కొనుగోలుదారులకు డబ్బును చెల్లించిన వెంటనే షిప్పింగ్ చేయనున్నట్లు రియల్మీ పేర్కొంది. ఈ షిప్పింగును 20 వ తేదీ నుండి మొదలు పెడుతుంది మరియు 21వ తేదీ లోపుగా దీని కోసం చెల్లించాల్సిన మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సివుంటుంది.

రియల్మి ఎక్స్ 2 ప్రో : ప్రత్యేకతలు

ఈ రియల్మీ ఎక్స్ 2 ప్రో  ఫోనులో  ఒక ప్రధాన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855+ చిప్‌ సెట్ ఇవ్వబడింది. ఇది కాకుండా, మీరు ఈ మొబైల్ ఫోనులోఒక 6.5-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను కూడా పొందుతారు. అంతేకాదు, ఈ డిస్ప్లేని FHD + రిజల్యూషన్‌తో అందించింది. ఈ మొబైల్ ఫోన్‌లో, మీరు వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 7 టి మరియు వన్‌ప్లస్ 7 టి ప్రో మొబైల్ ఫోన్‌ల మాదిరిగానే 90 Hz రిఫ్రెష్ రేట్‌ స్క్రీన్‌ను అందుకుంటారు మరియు  ఇది లిక్విడ్ కూలింగ్ ఫీచర్‌తో వస్తుంది. ముఖ్యంగా, ఇది ఒక 4000mAh సామర్థ్యం గల బ్యాటరీని 50W VOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజితో తీసుకొచ్చింది.

కెమెరా మొదలైన వాటి గురించి మాట్లాడితే, ఈ మొబైల్ ఫోన్‌లో మీకు క్వాడ్-కెమెరా సెటప్ లభిస్తోంది, ఇందులో మీకు 64 MP  ప్రధాన కెమెరా లభిస్తోంది, ఇది కాకుండా మీరు 8MP  అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌ తో పాటుగా  ఒక 13MP టెలిఫోటో లెన్స్‌తో పాటు 2MP డెప్త్ సెన్సార్‌ను కూడా పొందుతున్నారు. ఇది కాకుండా, మీరు ఫోన్‌లో ఇన్ డిస్ప్లే వేలిముద్ర సెన్సార్‌ను కూడా అందించింది                              

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo