రియల్‌మీ లేటెస్ట్ బిగ్ బ్యాటరీ ఫోన్ Realme P4R 5G ఫస్ట్ సేల్.!

HIGHLIGHTS

రియల్‌మీ లేటెస్ట్ బిగ్ బ్యాటరీ ఫోన్ Realme P4R 5G ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది

ఈ స్మార్ట్ ఫోన్ 8,000 mAh బ్యాటరీ ఫోన్ గా ఇండియాలో అడుగుపెట్టింది

ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి మంచి డీల్స్ మరియు ఆఫర్లు కూడా ప్రకటించింది

రియల్‌మీ లేటెస్ట్ బిగ్ బ్యాటరీ ఫోన్ Realme P4R 5G ఫస్ట్ సేల్.!

రియల్‌మీ లేటెస్ట్ బిగ్ బ్యాటరీ ఫోన్ Realme P4R 5G ఫస్ట్ సేల్ రేపు స్టార్ట్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8,000 mAh బ్యాటరీ ఫోన్ గా ఇండియాలో అడుగుపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అండర్ రూ. 20,000 బడ్జెట్ యూజర్ ను లక్ష్యంగా చేసుకుని రియల్‌మీ లాంచ్ చేసింది. రియల్‌మీ అందించిన ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి మంచి డీల్స్ మరియు ఆఫర్లు కూడా ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme P4R 5G : ఫస్ట్ సేల్

రియల్‌మీ పి4 ఆర్ ఫోన్ బేసిక్ (4 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 18,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ సెకండ్ వేరియంట్ (6 జీబీ + 128 జీబీ) ను రూ. 20,999 ధరతో మరియు హై ఎండ్ (6 జీబీ + 256 జీబీ) వేరియంట్ ను రూ. 22,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను టైటానియం గ్లేర్, సిల్వర్ గ్లేర్ మరియు లావెండర్ గ్లేర్ అనే మూడు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది.

Realme P4R 5G first sale and price

ఆఫర్స్

ఈ లేటెస్ట్ ఫోన్ పై రియల్‌మీ గొప్ప లాంచ్ ఆఫర్స్ జత చేసింది. ఈ ఫోన్ ను మొదటి సేల్ నుంచి ఫోన్ ఎక్స్ చేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ అందిస్తుంది. అలాగే, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కోన్ వారికి రూ. 2,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ రూ. 16,999 స్టార్టింగ్ ప్రైస్ తో లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్స్ 12 గంటలు జరిగే ఫస్ట్ డే సేల్ నుంచి మాత్రమే లభిస్తాయి.

Also Read: EPFO 3.0 Update: ఎంప్లాయిస్ ATM మరియు UPI ద్వారా నేరుగా డబ్బులు తీసుకునే అవకాశం స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే.!

Realme P4R 5G : ఫీచర్స్

రియల్‌మీ పి4 ఆర్ 6.8 ఇంచ్ బిగ్ LCD డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ రియల్‌మీ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 ప్రాసెసర్ తో నడుస్తుంది. ఈ ఫోన్ లో 6 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ ను రియల్‌మీ ఆఫర్ చేసింది. ఇది Realme UI 7.0 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో పని చేస్తుంది.

కెమెరా సెటప్ పరంగా, ఈ ఫోన్ 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా తో పాటు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30FPS FHD వీడియో సపోర్ట్ మరియు Ai కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కెమెరాతో జతగా ప్రత్యేకమైన Ai పల్స్ లైట్ కూడా ఉంటుంది. ఇది కెమెరా సెటప్ కి ప్రత్యేకమైన ఆకర్షణ అందిస్తుంది. ఈ ఫోన్‌ 8000mAh భారీ బ్యాటరీని 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6.5W రివర్స్ ఛార్జ్ మరియు బైపాస్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP65 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile