EPFO 3.0 Update: ఎంప్లాయిస్ ATM మరియు UPI ద్వారా నేరుగా డబ్బులు తీసుకునే అవకాశం స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే.!

HIGHLIGHTS

దేశంలో ఉన్న కోట్లాది మంది ఉద్యోగులకు గొప్ప శుభవార్త

EPFO 3.0 Update ద్వారా ఇక పై ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు పొందడం మరింత సులభం

UPI మరియు ATM ల ద్వారా నేరుగా పీఎఫ్ అమౌంట్ ని విత్‌ డ్రా చేసుకునే అవకాశం

EPFO 3.0 Update: ఎంప్లాయిస్ ATM మరియు UPI ద్వారా నేరుగా డబ్బులు తీసుకునే అవకాశం స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే.!

దేశంలో ఉన్న కోట్లాది మంది ఉద్యోగులకు గొప్ప శుభవార్త. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తీసుకొస్తున్న EPFO 3.0 అప్‌ డేట్ ద్వారా ఇక పై ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు పొందడం మరింత సులభం అవుతుంది. ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ విత్‌ డ్రా కోసం క్లెయిమ్ దాఖలు చేసి కొన్ని రోజులు లేదా వారాలు వేచి చూడాల్సి వస్తోంది. అయితే, ప్రభుత్వం అమలు చేయనున్నట్లు చెబుతున్న కొత్త డిజిటల్ సిస్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు UPI మరియు ATM ల ద్వారా నేరుగా పీఎఫ్ అమౌంట్ ని విత్‌ డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

EPFO 3.0 Update: కొత్త అప్‌డేట్ బెనిఫిట్స్ ఏమిటి?

ఈపిఎఫ్ఓ 3.0 లో ప్రధానంగా పేపర్‌ లెస్ సేవలు, వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్, UPI ఇంటిగ్రేషన్ తో పాటు ATM ఆధారిత పీఎఫ్ విత్‌ డ్రా వంటి ఫీచర్లను అందుబాటులోకి తీసుకు రాబోతోంది ప్రభుత్వం. ఈ కొత్త సిస్టం ద్వారా పీఎఫ్ డబ్బులను నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి UPI ద్వారా బదిలీ చేసే సౌకర్యం కల్పించనున్నట్లు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌ సుఖ్ మాండవియా గతంలో వెల్లడించారు.

EPFO 3.0 Update : ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?

చాలా మంది ఎదురు చూస్తున్న ప్రశ్న ఇదే అని చెప్పవచ్చు. ఈ సౌకర్యం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అని కొత్త అప్డేట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం ఈపీఎఫ్ 3.0 కొత్త సిస్టం దశలవారీగా అమలు చేయబడుతుందని తెలుస్తోంది. UPI మరియు ATM ద్వారా PF విత్‌ డ్రా సదుపాయం కోసం టెస్టింగ్ మరియు సాంకేతిక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

EPF 3.0 Update

జూన్ 2026 నాటికి ఈ సేవ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు. అయితే, ఈ సర్వీస్ అధికారిక అమలు తేదీ పై ఈపిఎఫ్ఓ ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయినా సరే, 2026 లో దశలవారీగా ఈ కొత్త సేవలు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు పీఎఫ్ డబ్బులు మరింత వేగంగా పొందగలరు. అయితే, ఎంప్లాయిస్ UAN, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా లింక్ చేసి ఉంటే మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో నిధులు అవసరమైనప్పుడు ఈ సౌకర్యం ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది.

Also Read: NEET Re Exam కోసం Telegram పై తాత్కాలిక నిషేధం విధించిన కేంద్రం.!

అయితే, ఈపిఎఫ్ఓ అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు తేదీలు మరియు విత్‌ డ్రా పరిమితుల విషయంలో వచ్చే ఫేక్ న్యూస్ మరియు అసత్య ప్రచారం తో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile