Realme P4 Pro First Sale నుంచి రూ. 5,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.. ఒక్కరోజు మాత్రమే.!
Realme P4 Pro First Sale నుంచి రూ. 5,000 భారీ డిస్కౌంట్ అందుకోండి
ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా ప్రకటించిన రెండు డిస్కౌంట్ ఆఫర్స్ ద్వారా ఈ డిస్కౌంట్ లభిస్తుంది
మొదటి సేల్ నుంచి కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ అందిస్తుంది
Realme P4 Pro First Sale నుంచి రూ. 5,000 భారీ డిస్కౌంట్ అందుకోండి అంటోంది రియల్ మీ. ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా ప్రకటించిన రెండు డిస్కౌంట్ ఆఫర్స్ ద్వారా ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, ఈ డిస్కౌంట్ ఆఫర్స్ ను కేవలం ఒక రోజు కోసం మాత్రమే అందుబాటులో ఉంచుతుంది. అంటే, ఈ ఫోన్ ను ఆగస్టు 27న జరగనున్న మొదటి సేల్ నుంచి కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ అందిస్తుంది.
SurveyRealme P4 Pro First Sale ఆఫర్లు ఏమిటి?
రియల్ మీ పి4 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ సమయంలో ఈ ఫోన్ పై రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో ఒకటి రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ మరియు మరొకటి రూ. 2,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్. ఈ రెండు ఆఫర్లు కూడా రేపు జరిగే ఫస్ట్ సేల్ నుంచి పొందవచ్చు.
Realme P4 Pro ఫోన్ ప్రైస్ ఏమిటి?
ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో ఇండియాలో విడుదల చేసింది. ఈ మూడు వేరియంట్ ధరలు ఈ క్రింద చూడవచ్చు.
- రియల్ మీ పి4 ప్రో (8GB + 128GB) ధర : రూ. 24,999
- రియల్ మీ పి4 ప్రో (8GB + 256GB) ధర : రూ. 26,999
- రియల్ మీ పి4 ప్రో (12GB + 256GB) ధర : రూ. 28,999
ఈ ఫోన్ ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం అనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ Flipkart మరియు realme అఫీషియల్ సైట్ నుండి లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ లభించే ప్రైస్ వివరాలు ఈ క్రింద చూడవచ్చు.

- రియల్ మీ పి4 ప్రో (8GB + 128GB) ధర : రూ. 19,999
- రియల్ మీ పి4 ప్రో (8GB + 256GB) ధర : రూ. 21,999
- రియల్ మీ పి4 ప్రో (12GB + 256GB) ధర : రూ. 23,999
రియల్ మీ పి4 ప్రో స్పెక్స్ ఏమిటి?
రియల్ మీ పి4 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో వచ్చింది. ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్,144 FPS BGMI సపోర్ట్ మరియు 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 6.8 ఇంచ్ 4D కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ లో గొప్ప విజువల్స్ మరియు గుడ్ గేమింగ్ కోసం ప్రత్యేకమైన Hyper Vision AI చిప్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 తో అందించింది మరియు జతగా ఇందులో 12 జీబీ ఫిజికల్, 10 జీబీ ర్యామ్ ఎక్స్ పెన్షన్ మరియు 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో 50MP Sony IMX 896 మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ మరియు మరో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ రెండు కెమెరా లతో కూడా 4K వీడియో (30/60FPS) రికార్డింగ్ చేస్తుంది. అంతేకాదు, AI Edit Gane, రియల్ మీ కెమెరా ఫిల్టర్లు మరియు మరిన్ని AI కెమెరా ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ IP65 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile