Realme P4 Lite 5G top features revealed ahead of launch
Realme P4 Lite 5G: రియల్ మీ అప్ కమింగ్ 5g స్మార్ట్ ఫోన్ రియల్ మీ పి4 లైట్ యొక్క టాప్ ఫీచర్లను లాంచ్ కంటే ముందే కంపెనీ రివీల్ చేసింది. ఈ అప్ కమింగ్ ఫోన్ ను సరికొత్త లుక్స్ లో టాప్ ట్రెండింగ్ ఫీచర్స్ జతగా లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ చెబుతోంది. మరి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ చెబుతున్న విశేషాలు మరియు ఈ ఫోన్ టాప్ ఫీచర్లు ఏమిటో ఒక లుక్కేద్దాం పదండి.
రియల్ మీ పి4 లైట్ స్మార్ట్ ఫోన్ ను మార్చి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తర్వాత రియల్ మీ అఫీషియల్ వెబ్సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
రియల్ మీ పి4 లైట్ స్మార్ట్ ఫోన్ 6.8 ఇంచ్ బిగ్ స్క్రీన్ ను 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 900 నిట్స్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5 లక్షల 60 కంటే అధిక AnTuTu స్కోర్ కలిగిన మీడియాటెక్ బడ్జెట్ చిప్ సెట్ Dimensity 6300 తో లాంచ్ అవుతుంది. ఇది 6nm చిప్ సెట్ మరియు జతగా 14GB వరకు ర్యామ్ ఫీచర్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో మంచి పెర్ఫార్మెన్స్ అందించే ఫీచర్స్ తో ఉన్నట్లు ఈ ఫీచర్స్ ద్వారా కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ ఎయిర్ ఫ్లో ఎయిర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కలిగిన ఫోన్ అవుతుందని రియల్ మీ చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ కొత్త కలర్ పాప్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ 13MP AI డ్యూయల్ రియర్ కెమెరాతో ఆకట్టుకుంటుంది. ఇందులో AI ఎరేజర్ 2.0 వంటి లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ రియల్ మీ UI 7.0 సాఫ్ట్ వేర్ తో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, 2 సంవత్సరాల OS అప్డేట్స్ మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందుకుంటుంది.
Also Read: boAt 3.1.2 Dolby Atmos సౌండ్ బార్ ను కేవలం 8 వేల బడ్జెట్ ధరలో అందుకోండి.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 7000 mAh భారీ టైటాన్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జ్ టెక్ మరియు ఇతర పరికరాలు వేగంగా ఛార్జ్ చేసే రివర్స్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా ఈ ఫోలే కలిగి ఉంటుంది.