Realme P4 Lite 5G: చవక ధరలో 7000 mAh బిగ్ బ్యాటరీ 5జి ఫోన్ గా లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

రియల్‌మీ పి4 లైట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది

Realme P4 Lite 5G చవక ధరలో 7000 mAh బిగ్ బ్యాటరీ 5జి ఫోన్ గా లాంచ్ అయ్యింది

బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో 7000 mAh భారీ టైటాన్ బ్యాటరీతో లాంచ్ అయిన ఫోన్ గా నిలుస్తుంది

Realme P4 Lite 5G: రియల్‌మీ పి4 లైట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ చవక ధరలో 7000 mAh బిగ్ బ్యాటరీ 5జి ఫోన్ గా లాంచ్ అయ్యింది. ఈ కొత్త ఫోన్ ను ఆకట్టుకునే సరికొత్త డిజైన్ మరియు మంచి కెమెరా సెటప్ తో కూడా రియల్‌మీ అందించింది. ఈ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ వివరంగా చూద్దాం.

Realme P4 Lite 5G: ప్రైస్

రియల్‌మీ పి4 లైట్ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్ లో లాంచ్ చేసింది.

రియల్‌మీ పి4 లైట్ (4GB + 64GB) ప్రైస్ : రూ. 12,999

రియల్‌మీ పి4 లైట్ (4GB + 128GB) ప్రైస్ : రూ. 13,999

రియల్‌మీ పి4 లైట్ (6GB + 128GB) ప్రైస్ : రూ. 15,999

ఈ స్మార్ట్ ఫోన్ మొసాయిక్ గ్రీన్ మరియు మొసాయిక్ బ్లూ రెండు రంగుల్లో లభిస్తుంది. మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ మొదటి రోజు సేల్ నుంచి మొదటి 12 గంటల లోపు ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారి కోసం గొప్ప ఆఫర్లు కూడా అనౌన్స్ చేసింది.

ఆఫర్స్

రియల్‌మీ పి4 లైట్ ఫస్ట్ డే సేల్ మొదటి 12 గంటల లోపు కొనుగోలు చేసే వారికి రూ. 1,000 రూపాయల భారీ తగ్గింపు ఆఫర్ అందించింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 500 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 11,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు రియల్‌మీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Also Read: OPPO K14 5G Sale: ఫస్ట్ డే బెస్ట్ డీల్స్ తో సేల్ రేపు స్టార్ట్ అవుతుంది.!

Realme P4 Lite 5G: ఫీచర్స్

రియల్‌మీ పి4 లైట్ ఫోన్ పెద్ద 6.8 ఇంచ్ LCD స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 900 నిట్స్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను కూడా మీడియాటెక్ బడ్జెట్ ప్రోసెసర్ Dimensity 6300 తో అందించింది మరియు ఇది 5 లక్షల 60 కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ ఫోన్ ను మరింత వేగంగా మార్చడానికి వీలుగా 6 జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 8 జీబీ అదనపు ర్యామ్ తో టోటల్ 14GB ర్యామ్ ఫీచర్ కూడా అందించింది.

ఈ రియల్‌మీ కొత్త ఫోన్ 13MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ లో లేటెస్ట్ Ai కెమెరా ఫీచర్స్ అయిన AI ఎరేజర్ 2.0 వంటి చాలా ఏఐ కెమెరా ఫీచర్స్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ Realme UI 7.0 తో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS పై నడుస్తుంది. ఈ ఫోన్ 2 సంవత్సరాల OS అప్ గ్రేడ్స్ మరియు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ సపోర్ట్ తో వచ్చింది.

బ్యాటరీ సెటప్ విషయానికి వస్తే, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో 7000 mAh భారీ టైటాన్ బ్యాటరీతో లాంచ్ అయిన ఫోన్ గా నిలుస్తుంది. ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ బైపాస్ ఛార్జ్ మరియు రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ BC, AAC, LDAC, aptX, aptX HD, LHDC 5.0 వంటి మంచి ఆడియో ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :