Realme P4 5G: కాంపిటీటివ్ ప్రైస్ లో భారీ ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన రియల్ మీ.!

HIGHLIGHTS

రియల్ మీ ఈరోజు Realme P4 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది

HDR 10+ AMOELD మరియు 7000 mAh బిగ్ బ్యాటరీ వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్స్ తో వచ్చింది

రియల్ మీ P4 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది

Realme P4 5G: కాంపిటీటివ్ ప్రైస్ లో భారీ ఫీచర్స్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన రియల్ మీ.!

Realme P4 5G : రియల్ మీ ఈరోజు రియల్ మీ P4 స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కాంపిటీటివ్ ప్రైస్ లో భారీ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ HDR 10+ సపోర్ట్ కలిగిన డిస్ప్లే మరియు 7000 mAh బిగ్ బ్యాటరీ వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్స్ తో ఆకర్షణీయమైన ధరలో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ రియల్ మీ ఫోన్ ధర మరియు స్పెక్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme P4 5G: ప్రైస్

రియల్ మీ P4 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 18,499 స్టార్టింగ్ ప్రైస్ తో ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ ని ఈ ధరతో అందించింది. ఈ ఫోన్ (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ ని రూ. 19,499 ధరతో మరియు హై ఎండ్ (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ని రూ. 21,499 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ రియల్ మీ అఫీషియల్ వెబ్సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది.

Realme P4 5G price and Specs

రియల్ మీ P4 ఆఫర్స్ ఏమిటి?

ఈ ఫోన్ మంచి ఆఫర్లు కూడా లాంచ్ ఆఫర్స్ లో భాగంగా అందించింది. ఈ ఫోన్ పై రూ. 5,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 1,000 ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ ను బ్యాంక్ కార్డ్ తో కొనే వారికి ఈ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 14,999 ఆఫర్ ప్రైస్ తో లభిస్తుంది. ఈ బిగ్ డీల్స్ ఈరోజు రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు మరియు 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు మాత్రమే వర్తిస్తుంది.

Realme P4 5G ఫీచర్స్ ఏమిటి?

ఈ ఫోన్ ప్రైస్ దృశ్య ఈ ఫోన్ భారీ ఫీచర్స్ కలిగి ఉంటుందని చెప్పొచ్చు. ఈ ఫోన్ కేవలం 7.58mm మందంతో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అతి సన్నని ఫోన్ గా ఉంటుంది. ఈ ఫోన్ Netflix HDR సర్టిఫికేషన్ కలిగిన 6.77 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఎండలో కూడా చక్కగా కనిపించే విధంగా ఉంటుంది.

Realme P4 5G price

రియల్ మీ P4 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ సెట్ 7,78,000 కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ చిప్ సెట్ తో జతగా ఈ ఫోన్ లో 8 జీబీ ఫిజికల్ ర్యామ్, 8 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. ఈ ఫోన్ IP65 అండ్ IP66 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో ఉంటుంది.

Also Read: LG Dolby Atmos జబర్దస్త్ సౌండ్ బార్ మంచి ఆఫర్లు ప్రకటించిన అమెజాన్.!

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 50MP మెయిన్, 8MP అల్ట్రా వైడ్ కి జతగా మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, AI కెమెరా ఫీచర్స్ మరియు AI ఎడిట్ జీనీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 80W అల్ట్రా ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు O రియాలిటీ ఆడియో ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile