Realme P3 ultra: గత నెల ఇండియన్ మార్కెట్లో Realme P3 Pro స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన రియల్ మీ, ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి పి 3 అల్ట్రా ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆల్ రౌండ్ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ అందించే ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫోన్ కలిగి లేని ఫీచర్స్ కలిగి ఉంటుందని కూడా రియల్ మీ గొప్పగా చెబుతోంది.
Survey
✅ Thank you for completing the survey!
Realme P3 Ultra: లాంచ్
రియల్ మీ పి అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను మార్చి 19న మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు రియల్ మీ ప్రకటించింది. ఈ ఫోన్ ను కూడా Flipkart సేల్ పార్ట్నర్ గా అందిస్తుంది. అందుకే, ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.
రియల్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను సేమ్ ప్రైస్ రేంజ్ లో డబుల్ పెర్ఫార్మెన్స్ అందించే గొప్ప చిప్ సెట్ తో లాంచ్ చేస్తుందట. ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ చిప్ సెట్ Dimensity 8350 Ultra తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ చిప్ సెట్ తో విడుదలయ్యే మొదటి ఇదే మరియు ఇది 14,50,000 కంటే అధికమైన AnTuTu స్కోర్ అందిస్తుందని కూడా రియల్ మీ తెలిపింది. అంటే, ఈ ఫోన్ ధర తక్కువ ఉంటుంది మరియు ఈ ఫోన్ డబుల్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని అర్థం వచ్చేలా రియల్ మీ హింట్ ఇచ్చింది.
ఈ ఫోన్ లో అందించిన చిప్ సెట్ కు తోడుగా ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ అందించే 12GB LPDDR 5X ర్యామ్ మరియు 256GB UFS 3.1 ఫాస్ట్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ 6000 mAh పవర్ ఫుల్ బ్యాటరీ మరియు 80W AI బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో అతి పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం ను కూడా అందించింది.
ఇది కాకుండా ఈ ఫోన్ లో 2500 Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 90FPS స్టేబుల్ గేమింగ్ 3 గంటల వరకు అందించే స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ మార్చి 13వ తేదీన రియల్ మీ రివీల్ చేస్తుందట.