Realme P3 Series: ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ చేస్తున్న రియల్ మీ.!

HIGHLIGHTS

రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సీరీస్ లాంచ్ అనౌన్స్ చేసింది

రియల్ మీ పి 3 సిరీస్ ను BGMI India Series 2025 తో టీజింగ్ చేస్తోంది

ఈ కొత్త సిరీస్ పై BGMI గేమ్ ఎక్స్పీరియన్స్ చేయండని రియల్ మీ టీజింగ్ చేస్తోంది

Realme P3 Series: ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ చేస్తున్న రియల్ మీ.!

Realme P3 Series: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సీరీస్ లాంచ్ అనౌన్స్ చేసింది. అదే రియల్ మీ పి 3 సిరీస్. ఈ సిరీస్ లాంచ్ ను BGMI India Series 2025 తో టీజింగ్ చేస్తోంది. ఈ సిరీస్ ను ‘Slay Every Battlefield’ ట్యాగ్ లైన్ తో ఈ సిరీస్ ను టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ఈ కొత్త సిరీస్ పై BGMI గేమ్ ఎక్స్పీరియన్స్ చేయండని రియల్ మీ టీజింగ్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme P3 Series ఎప్పుడు లాంచ్ అవుతుంది?

రియల్ మీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ గురించి ప్రస్తుతానికి ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ సిరీస్ వివరాలు తెలియ చేసే హింట్ తో టీజింగ్ మొదలుపెట్టింది. ఈ ఫోన్ కోసం Flipkart ను సేల్ పార్ట్నర్ గా ప్రకటించింది. అందుకే, ఫ్లిప్ కార్ట్ కూడా ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.

Realme P3 Series గురించి కంపెనీ ఏమి టీజింగ్ చేస్తోంది?

రియల్ మీ యొక్క ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను BGMI సర్టిఫైడ్ పెర్ఫార్మెన్స్ తో అందిస్తున్నట్లు రియల్ మీ చెబుతోంది. ఇందులో ప్రధానమైన అంశాలు కూడా రియల్ మీ వెల్లడించింది. ఈ ఫోన్ స్టేబుల్ ఫ్రేమ్ పెర్ఫార్మెన్స్ మరియు హై ఫ్రేమ్ రేట్ సపోర్ట్ కలిగిన స్క్రీన్ కలిగి ఉంటుందట. అలాగే, ఈ ఫోన్ ను మరింత వేగంగా చల్లబరిచే కూలింగ్ టెక్నాలజీ లేదా సెటప్ ఉంటుందని కూడా హింట్ ఇంచింది.

Realme P3 Series Launch

ఇది మాత్రమే కాదు, ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఎఫిషియంట్ బ్యాటరీ వాడకం, స్థిరమైన నెట్వర్క్ కనెక్షన్ మరియు అంతరాయం లేని టచ్ యాక్యురసీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుందని రియల్ మీ చెబుతోంది.

Also Read: Vivo V50 Launch: పిక్చర్ పర్ఫెక్ట్ సూపర్ కెమెరాతో వస్తున్న వివో అప్ కమింగ్ ఫోన్.!

రియల్ మీ టీజింగ్ చేస్తూంటే, ఈ అప్ కమింగ్ సిరీస్ ను గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే చిప్ సెట్, పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ మరియు సూపర్ కూలింగ్ టెక్నాలజీ తో ఆకట్టుకునే స్క్రీన్ తో అందించే అవకాశం ఉందని అనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ ఎటువంటి ఫీచర్స్ తో లాంచ్ అవుతోందో తెలుసుకోవడానికి మరి కొంత కాలం వేచి చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo