Realme P3 Pro 5G today available under rs 20000 from flipkart
Realme P3 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో రీసెంట్ గా విడుదలైన స్మార్ట్ ఫోన్ మరియు ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ మంచి డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను రియల్ మీ ఇటీవలే ఇండియాలో విడుదల చేసింది మరియు ఈ ఫోన్ గొప్ప డిజైన్, స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ మరియు కర్వుడ్ స్క్రీన్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ఈరోజు 20 వేల రూపాయల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
రియల్ మీ పి 3 ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 23,999 రూపాయల ద్గరతో లాంచ్ అయ్యింది. అయితే, ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకుని ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు కేవలం రూ. 19,999 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తోంది. వాస్తవానికి, నిన్న కూడా ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ రూ. 22,999 రూపాయల ధరకు సేల్ అయ్యింది. కానీ ఈరోజు ఉదయం నుంచి ఈ ఫోన్ ఈ ఆఫర్ ప్రైస్ తో సేల్ అవుతోంది.
కేవలం బేసిక్ వేరియంట్ ,మాత్రమే కాదు ఈ ఫోన్ 8 GB + 256 GB వేరియంట్ మరియు కూడా నాలుగు వేల రూపాయల డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 20,999 మరియు రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తున్నాయి. ఈ ఫోన్ ను Flipkart Axis Bank క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు 5% అదనపు క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. అంటే, వెయ్యి రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అందుకునే అవకాశం ఉంది.
మిడ్ రేంజ్ గేమింగ్ మరియు మల్టీ టాస్కింగ్ యూజర్లను టార్గెట్ చేస్తూ రియల్ మీ ఈ ఫోన్ ను రీసెంట్ గా లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం అనువైన 6.83 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ అందించింది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120 Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ సపోర్ట్ మరియు 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ Snapdragon 7s Gen 3 5G చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు దీనికి జతగా 8GB / 12GB ర్యామ్ సపోర్ట్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 128GB మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 50MP Sony IMX 896 మెయిన్ సెన్సార్ మరియు 2MP రెండవ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 30fps తో 4K వీడియో రికార్డింగ్ సత్తా మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: బడ్జెట్ ధరలో Dolby Atmos సౌండ్ బార్ లాంచ్ చేసిన boAt : ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ ఫోన్ లో గేమింగ్ కోసం అవసరమైన గొప్ప బ్యాటరీ మరియు ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు 80W అల్ట్రా ఛార్జ్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ IP66, 68, 69 రేటింగ్ తో గొప్ప వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది.