Realme P3 Pro 5G First Sale: భారీ ఆఫర్స్ తో రియల్ మీ కొత్త ఫోన్ మొదటి సేల్.!

HIGHLIGHTS

Realme P3 Pro 5G First Sale ఈరోజు మధ్యాహ్నం 112 గంటలకు ప్రారంభం అవుతుంది

ఈరోజు గొప్ప లాంచ్ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వస్తుంది

ఈ ఫోన్ లో 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీ వుంది

Realme P3 Pro 5G First Sale: భారీ ఆఫర్స్ తో రియల్ మీ కొత్త ఫోన్ మొదటి సేల్.!

Realme P3 Pro 5G First Sale ఈరోజు మధ్యాహ్నం 112 గంటలకు ప్రారంభం అవుతుంది. బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో రియల్ మీ మార్కెట్ లో ప్రవేశపెట్టిన ఈ ఫోన్ ఈరోజు గొప్ప లాంచ్ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వస్తుంది. సేల్ కంటే ముందు ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్ల పై ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme P3 Pro 5G First Sale: ఆఫర్స్

రియల్ మీ పి3 ప్రో స్మార్ట్ ఫోన్ 8GB + 128GB వేరియంట్ రూ. 23,999 ధరతో మరియు 12GB + 256GB వేరియంట్ రూ. 26,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పై లాంచ్ అఫర్ లో భాగంగా ఆల్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ పై రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.

ఈ ఫోన్ Flipkart మరియు realme.com నుంచి ఈ ప్రైస్ మరియు ఆఫర్స్ తో రేపు మధ్యాహ్నం నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం అవుతుంది.

Realme P3 Pro 5G: ఫీచర్స్

ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ 6.83 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ ఎడ్జ్ ఫ్లో స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు స్టేబుల్ 90FPS గేమింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ 8 లక్షల AnTuTu స్కోర్ కలిగిన Snapdragon 7s Gen 3 లేటెస్ట్ 4nm చిప్ సెట్ తో వచ్చింది. దీనికి జతగా 12GB వరకు ర్యామ్ మరియు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Realme P3 Pro 5G First Sale

ఈ రియల్ మీ ఫోన్ వెనుక 50MP (Sony IMX896) OIS సపోర్టెడ్ మెయిన్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్టేబుల్ 4K వీడియోలు 30fps వద్ద రికార్డ్ చేసే సత్తా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ సినిమాటిక్ వీడియో సపోర్ట్ మరియు స్టన్నింగ్ ఇమేజ్ కాప్చర్ చేసే సత్తా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇందులో AI కెమెరా ఫీచర్స్ మరియు అండర్ వాటర్ మోడ్ కూడా ఉంటుంది.

Also Read: Nothing Phone (3a) Series స్టన్నింగ్ లుక్ మరియు పవర్ ఫుల్ కెమెరాతో వస్తోంది.!

ఇక ఈ ఫోన్ కలిగిన ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 80W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీ వుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ కూడా వుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా ఇందులో వుంది. అంతేకాదు, ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile