Realme P1 Speed 5G: 26GB ర్యామ్ మరియు ఆకట్టుకునే డిజైన్ తో లాంచ్ అయ్యింది.!
Realme P1 Speed 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు రియల్ మీ విడుదల చేసింది
ఈ ఫోన్ ను ఆకట్టుకునే డిజైన్ మరియు కొత్త కలర్ ఆప్షన్ తో విడుదల చేసింది
26GB హెవీ ర్యామ్ ఫీచర్ మరియు మరిన్ని ప్రత్యేకతలతో మార్కెట్ లో ప్రవేశపెట్టింది
Realme P1 Speed 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు రియల్ మీ విడుదల చేసింది. ఈ ఫోన్ ను ఆకట్టుకునే డిజైన్ మరియు కొత్త కలర్ ఆప్షన్ తో విడుదల చేసింది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ ను 26GB హెవీ ర్యామ్ ఫీచర్ మరియు మరిన్ని ప్రత్యేకతలతో ఇండియన్ మార్కెట్ లో ఈరోజు ప్రవేశపెట్టింది. ఈ రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
SurveyRealme P1 Speed 5G: ప్రైస్
రియల్ మీ P1 స్పీడ్ 5G స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క బేసిక్ 8GB + 128GB వేరియంట్ రూ. 15,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ 12GB + 256GB వేరియంట్ రూ. 17,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది.
ఆఫర్స్ :
ఈ ఫోన్ పైన మంచి లాంచ్ ఆఫర్స్ కూడా రియల్ మీ అందించింది. ఈ ఫోన్ పైన రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ను ఆఫర్ ను ప్రకటించింది. అక్టోబర్ 20 వ తేదీ ఈ ఫోన్ మొదటి సేల్ మొదలవుతుంది.
Also Read: Realme NARZO 70 Turbo తో రూ. 2,199 విలువైన లేటెస్ట్ బడ్స్ ఫ్రీగా అందిస్తున్న అమెజాన్.!
Realme P1 Speed 5G: ఫీచర్స్
రియల్ మీ పి1 స్పీడ్ స్మార్ట్ ఫోన్ ను Dimensity 7300 Energy 5G చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ కి జతగా 12GB ఫిజికల్ ర్యామ్ మరియు 14GB Dynamic RAM సపోర్ట్ తో టోటల్ 26GB హెవీ ర్యామ్ ఫీచర్ తో ఈ ఫోన్ వస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా అందించింది. ఈ ఫోన్ లో 6. 67 ఇంచ్ OLED Esports స్క్రీన్ ను అందించింది ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ మరియు FHD+ రిజల్యూషన్ తో వస్తుంది.

రియల్ మీ పి1 స్పీడ్ ఫోన్ లో 30 fps వద్ద 4K వీడియోలు మరియు గొప్ప ఫోటోలు అందించే 50MP ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలియన్ 5000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ realme UI 5.0 సాఫ్ట్ వేర్ పై Android 14 పై నడుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
