Realme Narzo N55: ముగిసిన ఫస్ట్ సేల్..భారీ ఆఫర్లతో నెక్స్ట్ సేల్ ఎప్పుడంటే.!

HIGHLIGHTS

Realme Narzo N55 స్మార్ట్ యొక్క ఫస్ట్ ఫ్లాష్ సేల్ ముగిసింది

నెక్స్ట్ సేల్ నుండి గొప్ప అఫర్ లతో కొనుగోలు చేసే అవకాశం

ఆఫర్ల వివరాలతో పాటుగా స్పెక్స్ పైన కూడా ఒక లుక్కేద్దామా

Realme Narzo N55 స్మార్ట్ యొక్క ఫస్ట్ ఫ్లాష్ సేల్ ముగిసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క తరువాతి సేల్ భారీ ఆఫర్లతో ఏప్రిల్ 18వ తేదీ మద్యహ్నం 12 గంటల నుండి మొదలవుతుంది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కేవలం పదివేల బడ్జెట్ కేటగిరిలో బిగ్ కేమేరా సెటప్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ను నెక్స్ట్ సేల్ నుండి గొప్ప అఫర్ లతో కొనుగోలు చేసే అవకాశం కస్టమర్ల కోసం రియల్ మి అందించింది. మరి ఈ ఫోన్ సేల్ మరియు ఆఫర్ల వివరాలతో పాటుగా స్పెక్స్ పైన కూడా ఒక లుక్కేద్దామా.    

Realme Narzo N55: ధర&ఆఫర్స్

రియల్ మి నార్జో ఎన్55 బేసిక్ వేరియంట్ (4GB + 64GB) రూ.10,999 ధరతో వచ్చింది. అలాగే, (6GB + 128GB ) వేరియంట్ ధర రూ.12,999. ఏప్రిల్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ పైన అందించిన కూపన్ అఫర్ ద్వారా 4GB వేరియంట్ పైన రూ.700 మరియు 6GB వేరియంట్ పైన రూ.1,000 రూపాయల తగ్గింపును పొందవచ్చు. SBI    బ్యాంక్ మరియు HDFC క్రెడిట్/డెబిట్ కార్డ్ మరియు EMI ద్వారా ఈ ఫోన్ కొనేవారికి రూ.1,000 వరకూ డిస్కౌంట్ ను లభిస్తుంది.                    

Realme Narzo N55: స్పెస్పెసిఫికేషన్లు 

ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద 6.72 ఇంచ్ FHD+ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ రియల్ మి ఫోన్ మీడియాటెక్ Helio G88 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB/6GB RAM మరియు 64GB/128GB స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ స్టోరేజ్ ను 1TB వరకూ మెమొరీ కార్డ్ ద్వారా పెంచుకునే వీలుంది. 

ఈ స్మార్ట్ ఫోన్ 64MP AI డ్యూయల్ రియర్ కెమేరాతో వచ్చింది. ఈ రియర్ కెమేరాతో 1080 పిక్సెల్ తో 60fps వీడియోలను చిత్రీకరించ వచ్చని రియల్ మి తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమేరా వుంది. ఈ ఫోన్ realme UI 4.0 సాఫ్ట్ వేర్ తో Android 13 OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 5000mAh బిగ్ బ్యాటరీ ఉంది మరియు ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :