Realme Narzo 100x launching with 8000 mAh big battery
Realme Narzo 100x: రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్ గురించి అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను దృఢమైన బాడీ మరియు 8000 mAh బిగ్ బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్‌మీ తెలిపింది. ఈ అప్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను డైనమిక్ ర్యామ్ మరియు భారీ స్టోరేజ్ వంటి ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నట్లు కూడా రియల్‌మీ తెలిపింది.
రియల్‌మీ నార్జో 100x స్మార్ట్ ఫోన్ ను జూలై 15వ తేదీ 12 గంటలకు మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు రియల్‌మీ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా రియల్‌మీ వెల్లడించింది.
రియల్‌మీ నార్జో 100x స్మార్ట్ ఫోన్ ను MIL-STD 810H మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ తో దృఢమైన బాడీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన బిగ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ 6300 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ చిప్ సెట్ తో జతగా 14GB డైనమిక్ ర్యామ్ ఫీచర్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ బిల్ట్ ఇన్ Gemini Live సపోర్ట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో Ai అసిస్టెంట్, Ai ఎరేజర్ 2.0 మరియు మరిన్ని Ai ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో కెమెరాతో జతగా Ai పల్స్ లైట్ ను కూడా అందించింది. ఇది 9 కలర్స్ మరియు 5 స్పీడ్ ఆప్షన్స్ తో వస్తుంది. ఇది నోటిఫికేషన్ సమయంలో వెలుగుతుంది.
ఇక ఈ ఫోన్ కలిగిన కెమెరా సెటప్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా జతగా మరో కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ Ai కెమెరా ఫీచర్ మరియు మంచి వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ను ఫ్లాష్ ఆరెంజ్ మరియు మిడ్ నైట్ బ్లాక్ రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది.
Also Read: iQOO Z11 Lite: డైనమిక్ లైట్ మరియు లేటెస్ట్ AI ఫీచర్ తో లాంచ్ కి రెడీ.!
ఇక ఈ ఫోన్ మెయిన్ ఫీచర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 8000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కలిగిన బిగ్ బ్యాటరీ ని వేగంగా ఛార్జ్ చేసే 45W ఫస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ థెఫ్ట్ ప్రొటెక్షన్ మరియు రియల్‌మీ UI 7.0 సాఫ్ట్ వేర్ తో వస్తుంది. ఈ ఫోన్ 4 ఇయర్స్ స్మూత్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని కూడా రియల్‌మీ తెలిపింది.