Realme Narzo 100x complete features and expected price know one day before launch
Realme Narzo 100x: రియల్‌మీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్ రియల్‌మీ నార్జో 100 ఎక్స్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కావడానికి ఒక రోజు ముందే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కంప్లీట్ ఫీచర్స్ మరియు అంచనా ప్రైస్ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే, రియల్‌మీ ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ యూజర్ ని లక్ష్యంగా చేసుకొని భారీ ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రియల్‌మీ నార్జో 100 ఎక్స్ స్మార్ట్ ఫోన్ భారీ బ్యాటరీ మరియు గేమింగ్ కోసం అవసరమైన హెవీ రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన బిగ్ డిస్ప్లే తో లాంచ్ అవుతుంది. ఇది స్మూత్ స్క్రోలింగ్ మరియు మంచి ఫ్రేమ్ రేట్ తో గేమింగ్ కోసం సెట్ చేయబడింది. ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే, ఇది MIL-STD 810H మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో దృఢమైన బాడీ డిజైన్ కలిగి ఉంది.
ఈ ఫోన్ బడ్జెట్ మీడియాటెక్ చిప్ సెట్ గా పేరొందిన Dimensity 6300 తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ ను మరింత పీక్ కు తీసుకువెళ్లే 14GB డైనమిక్ ర్యామ్ ఫీచర్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. యాప్స్, గేమ్స్ మరియు అన్లిమిటెడ్ ఫోటోలు మరియు వీడియోలు స్టార్ చేయడానికి వీలుగా 256GB హెవీ స్టోరేజ్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ కెమెరాతో జతగా Ai పల్స్ లైట్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది నోటిఫికేషన్ లైట్ మరియు ఇది 9 కలర్స్ తో పాటు 5 స్పీడ్ ఎంపికలు కూడా కలిగి ఉంటుంది. మరింత గొప్ప విషయం ఏమిటంటే, ఈ ఫోన్ బిల్ట్ ఇన్ Gemini Live ఫీచర్ తో వస్తుంది.
ఈ ఫోన్ బ్యాటరీ మరియు బ్యాటరీ ఫీచర్స్ వివరాలు చూస్తే, ఈ ఫోన్ లో 8000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్ తో పాటు రివర్స్ ఛార్జ్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్ కలిగిన బిగ్ బ్యాటరీతో ఎక్కువ సమయం నిలిచి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ రియల్‌మీ UI 7.0 సాఫ్ట్ వేర్ తో జతగా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది మరియు థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
రియల్‌మీ నార్జో 100 ఎక్స్ స్మార్ట్ ఫోన్ ను రూ. 18,000 నుంచి రూ. 20,00 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.