రియల్మీ మిలియన్ డేస్ సేల్ : రియల్మీ C2 ఓపెన్ సేల్ మరియు రియల్మీ 3 ప్రో పైన డిస్కౌంట్.

HIGHLIGHTS

ఈ సేల్ నుండి, రియల్మీ సి 2 పైన 2 సంవత్సరాల వారంటీ ఇవ్వబడుతోంది. అలాగే, రియల్మీ3 ప్రో ధరలను కూడా భారీగా తగ్గించింది.

రియల్‌మే మిలియన్ డేస్ సేల్ నిన్నటి నుండి ప్రారంభమైంది. భారతదేశంలో చౌక ధరతో ప్రారంభించిన REALME  C 2, REALME 3 PRO స్మార్ట్‌ఫోన్లను గొప్ప ఆఫర్‌లతో అందిస్తున్నది. ఈ సేల్ నుండి, రియల్మీ సి 2 పైన  2 సంవత్సరాల వారంటీ ఇవ్వబడుతోంది. అలాగే, రియల్మీ3 ప్రో ధరలను కూడా  భారీగా తగ్గించింది. ఈ సెల్ జూలై 12 వరకు కొనసాగుతుంది. భారతదేశంలో, 2019 ఏప్రిల్‌లో రియల్మీ సి 2 లాంచ్‌ చేయబడింది మరియు ఇది పదిలక్షలకు పైగా యూనిట్లను విక్రయించిందని, ఈ ఆఫర్లను కంపెనీ ప్రకటించడానికి ఇదే కారణమని రియల్మీ తెలియచేసింది.

Ralme C 2 ధర

ఈ ఫోన్ను వినియోగదారులు డైమండ్ బ్లూ మరియు డైమండ్ బ్లాక్ వంటి కలర్ ఎంపికలతో కొనుగోలు చేయవచ్చు. ఈ రియల్మీ సి 2 రూ. 5,999 రూపాయల ధరలో మీకు 2 జిబి ర్యామ్ + 16 జిబి స్టోరేజ్ యొక్క బేస్ వేరియంట్ లభిస్తుంది. దీని 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ల ధర రూ .6,999 కాగా, ఫోన్ యొక్క 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .7,999 గా ఉంటుంది.

రియల్మే 3 ప్రో ధర

మీరు ఈ ఫోన్ను కార్బన్ గ్రే, నైట్రో బ్లూ మరియు లైటెనింగ్ పర్పుల్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ రియల్మీ3 ప్రో యొక్క ధరను తగ్గించిన తరువాత, ఈ ఫోన్ రూ .13,499 కు లభిస్తుంది, దీనిలో మీకు 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ లభిస్తాయి. వాస్తవానికి, దీని ముందస్తు మార్కెట్ ధర 13,999 రూపాయల నుండి మొదలవుతుంది.

దీని 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ .15,999, అయితే సెల్ లో 1,000 రూపాయలు కాగా ధర తగ్గించిన తరువాత రూ .14,999 ధరకు లభిస్తుంది. అలాగే, మీరు 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌ను రూ .15,999 కు కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :