Realme 9i: 6nm చిప్ సెట్ తో విడుదలకు సిద్ధమైన రియల్ మి స్మార్ట్ ఫోన్

Realme 9i: 6nm చిప్ సెట్ తో విడుదలకు సిద్ధమైన రియల్ మి స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

రియల్ మి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Realme 9i యొక్క ఇండియా లాంచ్ డేట్ ప్రకటించింది

స్నాప్ డ్రాగన్ 680 తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ టీజింగ్ చేస్తోంది

ఈ స్మార్ట్ ముందుగా వియాత్నం లో విడుదల చెయ్యబడింది

రియల్ మి తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Realme 9i యొక్క ఇండియా లాంచ్ డేట్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను జనవరి 18 మధ్యాహ్నం 12:30 గంటలకు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ స్మార్ట్ ముందుగా వియాత్నం లో విడుదల చెయ్యబడింది. ఇప్పుడు ఇండియాలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ 6nm చిప్ సెట్ స్నాప్ డ్రాగన్ 680 తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ టీజింగ్ చేస్తోంది.

Realme 9i: స్పెక్స్( వియాత్నం వేరియంట్)

రియల్ మి 9i స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన IPSLCD డిస్ప్లేని కలిగివుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ శక్తితో పనిచేస్తుంది. అయితే, ఇది 5GB ఎడిషన్ వర్చువల్ RAM కి మద్దతు ఇస్తుంది. అంటే, ఈ Realme ఫోన్ 11GB RAM పనితీరును ఇవ్వగలదు మరియు 128GB ఇంటర్నల్ స్టోర్ కూడా అందుతుంది. ఈ లేటెస్ట్ రియల్ మి ఫోన్  Realme UI 2.0 స్కిన్ పైన Android 11 OS పైన నడుస్తుంది.

ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని అందించింది. ఇందులో 50MP మైన్ కెమెరా, మ్యాక్రో మరియు B&W సెన్సార్ వున్నాయి. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని కలిగి వుంది. ఈ ఫోన్ టైప్-C పోర్ట్ తో 33W  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000 mAh  బ్యాటరీతో వస్తుంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo