24 న వస్తున్న Realme Narzo 50 స్మార్ట్ ఫోన్ …! ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ..!
Realme Narzo 50 స్మార్ట్ ఫోన్ ను విడుదల చెయ్యడానికి రియల్ మీ సిద్దమవుతోంది
ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ తో కూడా టీజింగ్ చేస్తోంది
మీడియాటెక్ హీలియో G96 చిప్‌సెట్ శక్తితో పనిచేస్తుంది
Realme Narzo 50 స్మార్ట్ ఫోన్ ను ఫిబ్రవరి 24న ఇండియాలో విడుదల చెయ్యడానికి రియల్ మీ సిద్దమవుతోంది. ఇటీవలే, 9 Pro సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన రియల్ మీ ఇప్పుడు Narzo సిరీస్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తోంది. ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ నార్జో 50 స్మార్ట్ ఫోన్ యొక్క టీజింగ్ కూడా మొదలుపెట్టింది. ఈ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ తో కూడా టీజింగ్ చేస్తోంది.
SurveyRealme Narzo 50: రివీల్డ్& అంచనా స్పెక్స్
ఇక Realme Narzo 50 యొక్క రివీల్డ్ స్పెక్స్ గురించి చూస్తే, ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G96 చిప్‌సెట్ శక్తితో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే, ఈ ఫోన్ లో అందించిన డిస్ప్లే గురించి కూడా రివీల్ చేసింది. ఈ ఫోన్ లో 120Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే ఉన్నట్లు రియల్ మీ పేర్కొంది. ఇక అంచనా స్పెక్స్ పరంగా, ఈ ఫోన్ 4+64GB మరియు 6+128GB వేరియంట్‌లతో అందించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ స్పీడ్ బ్లాక్ మరియు స్పీడ్ బ్లూ రంగులలో అందించబడుతుంది.
ఈ రియల్ మీ అప్ కమింగ్ USB-C పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయబడే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీతో ఉండవచ్చు.
కెమెరా విభాగంలో, ఈ ఫోన్‌లో 50MP + 2MP + 2MP వెనుక కెమెరా సెటప్ మరియు ఈ ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది. ఈ స్మార్ట్ ఫోన్ Android 12 (Android 12) ఆధారంగా realme UI 3.0లో పని చేస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
