ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్ చూస్తే వెంటనే కొనేస్తారు.!

HIGHLIGHTS

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ బిగ్ డిస్కౌంట్ అందించింది

ఈ ప్రీమియం సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి అతి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది

లాంచ్ ప్రైస్ తో పోలిస్తే దాదాపు సగం ధరకే ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తుంది

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్ చూస్తే వెంటనే కొనేస్తారు.!

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్ చూస్తే వెంటనే కొనేస్తారు. ఎందుకంటే, ఈ ప్రీమియం సౌండ్ బార్ ఈరోజు నుంచి మొదలైన ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి అతి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ఇండియన్ మార్కెట్ లో విడుదలైన లాంచ్ ప్రైస్ తో పోలిస్తే, దాదాపు సగం ధరకే ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్

గత సంవత్సరం భారీ సెటప్ మరియు భారీ సౌండ్ అవుట్ పుట్ తో జెబ్రోనిక్స్ అందించిన 7.2.4 ఛానల్ సౌండ్ బార్ Juke Bar 10000 ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అతి చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 44,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈ ప్రీమియం సౌండ్ బార్ ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు రూ. 12,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 32,999 ధరలో సేల్ చేస్తోంది.

ZEBRONICS 7.2.4 Dolby Atmos soundbar deal on flipkart freedom sale 2026

అదనంగా, ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ పై మరో రెండు బిగ్ డీల్స్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. అవేమిటంటే, ఈ సౌండ్ బార్ పై రూ. 4,000 భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,750 రూపాయల SBI క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి కేవలం రూ. 27,249 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇది ఈ సౌండ్ బార్ రిలీజ్ అయిన తర్వాత అత్యంత చవక ధరగా నమోదయ్యింది.

Also Read : iQOO Z11: డామినేటింగ్ డిజైన్ మరియు లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది.!

ZEBRONICS 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఇది కంప్లీట్ 7.2.4 ఛానల్ సెటప్ తో వచ్చే శక్తివంతమైన 1100W సౌండ్ బార్. ఇందులో ఫ్రంట్, అప్ ఫైరింగ్, సైడ్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, ఫ్రంట్ అండ్ అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ ఉఫర్స్ కలిగిన సబ్ ఉఫర్ సెటప్ ఉంటుంది.

ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ మరియు DTS : X సౌండ్ టెక్ సపోర్ట్ తో పాటు జెబ్రోనిక్స్ యొక్క ప్రత్యేకమైన ZEB అకౌస్టి మాక్స్ మల్టీ డైమెన్షనల్ ఆడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ నిజమైన సినిమా థియేటర్ అనుభూతిని మీ ఇంటికి తీసుకొస్తుంది. అంతేకాదు, HDMI eArc, ఆప్టికల్, బ్లూటూత్ మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది టచ్ కంట్రోల్స్ మరియు రిమోట్ కంట్రోల్ మరియు UFH వైర్లెస్ మైక్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile