realme launches 80000 mAh big battery 4g phone Realme C100x in india
Realme C100x: రియల్‌మీ ఈరోజు C సిరీస్ నుంచి కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. అదే, రియల్‌మీ C100x స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను బిగ్ బ్యాటరీ 4G ఫోన్ కోరుకునే వారి కోసం తగిన 8000 mAh భారీ బ్యాటరీతో అందించింది. హెవీ బ్యాటరీతో 5G స్మార్ట్ ఫోన్ లు ఇప్పటికే మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే, రియల్‌మీ భారీ బ్యాటరీతో 4G ఫోన్ ఈరోజు విడుదల చేసింది. ఇది ఇండియాలో అతి పెద్ద బ్యాటరీ కలిగిన 4జి ఫోన్ గా లాంచ్ అయ్యింది.
రియల్‌మీ సి 100x స్మార్ట్ ఫోన్ ను కేవలం 4GB + 64GB సింగల్ వేరియంట్ తో లాంచ్ చేసింది, ఈ ఫోన్ ను రూ. 14,499 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను ఈరోజు నుంచే సేల్ కి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు రియల్‌మీ అఫీషియల్ వైబ్సైట్ నుంచి లభిస్తుంది.
ఈ ఫోన్ గోల్డెన్ కోస్ట్ మరియు డీప్ బ్లూ టైడ్స్ అనే రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ ఆఫర్స్ లో భాగంగా ఈ ఫోన్ పై రూ. 500 డిస్కౌంట్ మరియు రూ. 500 ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది.
Also Read: Vivo T5 Lite : జస్ట్ లాంచ్ అయిన వివో లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ ఇవిగో.!
రియల్‌మీ C100x స్మార్ట్ ఫోన్ బడ్జెట్ 4G ఫోన్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇందులో 6.8 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 900 HBM బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. రియల్‌మీ ఫోన్ లో Unisoc T7250 ఆక్టా కోర్ ప్రాసెసర్ ని అందించింది. ఇది 4G చిప్స్ సెట్ మరియు 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. అవసరమైతే microSD కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజ్ ను పెంచుకోవచ్చు. ఇది 4G VoLTE మరియు డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది.
కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 50MP ప్రధాన కెమెరాతో పాటు సహాయక AI సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో నైట్ మోడ్, పోర్ట్రెయిట్, HDR, పానోరామా మరియు AI సీన్ డిటెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ రియల్‌మీ ఫోన్ లో 8,000mAh భారీ బ్యాటరీ ఉంది. అలాగే, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఈ ఫీచర్ తో తక్కువ సమయంలోనే బ్యాటరీని వేగంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. దీర్ఘకాల బ్యాటరీ బ్యాకప్, పెద్ద డిస్‌ప్లే, తగిన పెర్ఫార్మెన్స్ మరియు ఆకర్షణీయమైన డిజైన్ కారణంగా ఈ ఫోన్ విద్యార్థులు, కుటుంబ సభ్యులు మరియు సాధారణ వినియోగదారులకు మంచి బడ్జెట్ ఎంపికగా ఉండే అవకాశం ఉంటుంది.