Realme తన మొట్టమొదటి 5G స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది

Realme తన మొట్టమొదటి 5G స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది
HIGHLIGHTS

ఈ ఫోన్ అధికారికంగా ఈ రోజు ప్రవేశపెట్టబడింది.

రియల్మి తన మొదటి 5 జి స్మార్ట్‌ ఫోన్ రియల్మి X 50 5G ని చైనాలో విడుదల చేసింది. ఈ హ్యాండ్‌ సెట్ 120 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్‌ తో వస్తుంది. ఈ ఫోన్ అధికారికంగా ఈ రోజు ప్రవేశపెట్టబడింది. అంతేకాకుండా, ప్రఖ్యాత జపనీస్ డిజైనర్ నావోటో ఫుకాసావా రూపొందించిన ఎక్స్ 50 5 జి మాస్టర్ ఎడిషన్ను బ్లాక్ అండ్ గోల్డ్ వెర్షన్లలో కంపెనీ పాయింట్స్ అండ్ లైన్స్ స్ఫూర్తితో పరిచయం చేసింది.

Realme X50 5G : ప్రత్యేకతలు 

రియల్మి ఎక్స్‌ 50 5 జి లో ఒక 6.57-అంగుళాల (1080 × 2400 పిక్సెళ్ళ) FHD +, LCD  డిస్ప్లే ఒక 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ తో ఉంటుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగన్ 765 G  7nm EUV  మొబైల్ ప్లాట్‌ ఫామ్‌ తో పనిచేస్తుంది, ఇది అడ్రినో 620 GPU తో జత చేయబడింది. ఇది 6GB / 8GB LPDDR4X RAM మరియు 128GB / 256GB (UFS 2.1) స్టోరేజ్ ఆప్షన్ మరియు 256GB (UFS 2.1) స్టోరేజ్ మోడల్‌ తో 12GB LPDDR4X RAM తో వస్తుంది.

ఇక కెమేరాల పరంగా, ఈ రియల్మి ఎక్స్ 50 5 జి వెనుక భాగంలో ఒక క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ ను కలిగి ఉంది. ఇందులో 1 / 1.72 పరిమాణంతో 0.8μm పిక్సెల్ సైజు మరియు ఎఫ్ / 1.8 ఎపర్చరు గల ఒక  64MP కెమెరా ″ శామ్‌సంగ్ GW 1 సెన్సార్ + f/ 2.5 ఎపర్చర్‌ తో 20x వరకు హైబ్రిడ్ జూమ్ చెయ్యగల 12 MP  టెలిఫోటో లెన్స్  + f / 2.25 ఎపర్చర్‌ గల 8 MP 119 డిగ్రీల అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ + f / 2.4 ఎపర్చర్‌ తో 2 MP  4 సెం.మీ మాక్రో లెన్స్ ఉన్నాయి. ఇది 960fps స్లో-మోషన్ వీడియోలను చక్కగా చిత్రీకరించగలదు. ఈ స్మార్ట్‌ ఫోన్, 16 MP + 8 MP  డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

ప్రతి ఆటను విడిగా డౌన్‌లోడ్ చేయకుండా ఒకే యాప్  ద్వారా ఆడగల క్లౌడ్-ఆధారిత మొబైల్ గేమ్స్ అందించే NetEase  క్లౌడ్ గేమ్‌ లతో రియల్మి భాగస్వామ్యం కలిగి ఉంది. అయితే, ఈ ఫీచరును కేవలం  చైనాలో మాత్రమే ప్రకటించవచ్చు. ఇక మదర్ బోర్డు నుండి వెలువడే వేడిని చల్లబరచడానికి, ఒక 8mm రాగి మీడియం  కూడా ఉంది.

ఈ రియల్మి X50 5G  ఫోన్, ఒక 4200mAh బ్యాటరీతో 30W VOOC 4.0 ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్ USB టైప్-సి ఆడియో, 1216 లీనియర్ స్పీకర్, DolbyAtmos , Hi -Res  ఆడియో సర్టిఫికేషన్‌ తో వస్తుంది.

రియల్మి ఎక్స్‌ 50 5 జి ధర 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌  2499 యువాన్ (సుమారు రూ .25,800) వద్ద ప్రారంభమవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo