రియల్మీ కొత్త REALME 5 సిరీస్ తో రానుంది
న్యూ ఢిల్లీ లో జరిగనున్న ఒక కార్యక్రమంలో రియల్మీ 5 సిరీస్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు రియల్‌మి ప్రకటించింది.
ఆగస్టు 20 న న్యూ ఢిల్లీ లో జరిగనున్న ఒక కార్యక్రమంలో రియల్మీ 5 సిరీస్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు రియల్‌మి ప్రకటించింది. ఈ సంస్థ,ఈ సిరీస్ ఫోన్ల కోసం “లీప్ టు క్వాడ్ కెమెరా” ట్యాగ్‌లైన్‌ను ఉపయోగిస్తోంది ఎందుకంటే ఈ సిరీస్‌లోని ఫోన్లు నాలుగు కెమేరాలతో రానున్న రియల్‌మి హ్యాండ్‌సెట్‌లుగా ఉంటాయి. ఇందులోని వెనుక కెమెరాలు, శామ్సంగ్ 64 MP ప్రాధమిక కెమెరాతో ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ అదే కావచ్చని అనిపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా రిటైల్ అవుతాయి మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఇప్పటికే ‘రియల్మే 5’ సిరీస్ యొక్క టీజర్ అందించింది.
ఫ్లిప్‌కార్ట్ నుండి లభించే సమాచారం ప్రకారం, ఈ ఫోన్లో ప్రాధమిక లెన్స్‌తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, అది “పెద్ద ఎపర్చరు మరియు పిక్సెల్ సైజు” తో “ఖచ్చితమైన” తక్కువ-కాంతి చిత్రాలను తీయడంలో సహాయపడుతుంది. అయితే, రియల్‌మి 5 సిరీస్ ఫోన్లకు 64 ఎంపి సెన్సార్ ఉంటుందని కచ్చితంగా నిర్ధారించలేదు. 119-డిగ్రీల ఫీల్డ్ వ్యూతో అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు ఇతర లెన్స్‌లతో పోలిస్తే 1.5 రెట్లు ఎక్కువ ప్రాంతాన్ని మాత్రం సంగ్రహిస్తుందని పేర్కొన్నారు. సూపర్ మాక్రో లెన్స్ 4 సెం.మీ మైక్రోస్కోపిక్ ఫోకల్ లెంగ్త్ ఈ ఫోన్ కలిగి ఉంటుందని పేర్కొంది. పోర్ట్రెయిట్ చిత్రాలను క్లిక్ చేయడానికి నాల్గవ లెన్స్ గా ఇది ఉపయోగించబడుతుంది.
ఇటీవల, రియల్‌మి తన కెమెరా టెక్ ని ప్రదర్శించడానికి ఒక బ్రీఫింగ్ కూడా నిర్వహించింది. 64MP రిజల్యూషన్ ఉన్న శామ్సంగ్ బ్రైట్ జిడబ్ల్యు 1 సెన్సార్‌తో రియల్‌మి ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు గతంలో షెత్ ప్రకటించారు మరియు చిత్రాలను తీయడానికి కంపెనీ ఐసోసెల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది అని కూడా అన్నారు.