Realme GT8 Pro ఇండియా లాంచ్ డేట్ మరియు టాప్ ఫీచర్స్ అనౌన్స్ చేసిన కంపెనీ.!
Realme GT8 Pro స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్
రియల్ మీ అప్ కమింగ్ ప్రీమియం ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు టాప్ ఫీచర్లు కూడా ఈరోజు అనౌన్స్ చేసింది
లాంచ్ డేట్ ని కంపెనీ అఫిషియల్ X పేజీ నుంచి ఈరోజు అనౌన్స్ చేసింది
Realme GT8 Pro స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. రియల్ మీ అప్ కమింగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు టాప్ ఫీచర్లు కూడా ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మాడ్యులర్ రియర్ కెమెరా మరియు క్వాల్కమ్ మోస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది.
SurveyRealme GT8 Pro : లాంచ్ డేట్ ఏమిటి?
రియల్ మీ జిటి 8 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని కంపెనీ అఫీషియల్ X పేజీ నుంచి ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ యూనిక్ ఫోన్ గా లాంచ్ అవుతుంది మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Realme GT8 Pro : ఫీచర్స్
రియల్ మీ జిటి 8 ప్రో స్మార్ట్ ఫోన్ పేపర్ వంటి యూనిక్ లెథర్ డిజైన్ తో వస్తుంది. అంతేకాదు, కెమెరా మోడ్యూల్ ని స్విచ్ చేసే ఫీచర్ కలిగిన వరల్డ్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే అవుతుంది. ఈ ఫోన్ లో 2K రిజల్యూషన్ సపోర్ట్ కలిగిన గొప్ప డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 7000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్, AI హైపర్ విజన్ చిప్ మరియు మంచి ఐ ప్రొటెక్షన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ మోస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 తో లాంచ్ అవుతుంది. ఇది 40 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే 3nm TSMC చిప్ సెట్ మరియు జతగా LPDDR5X ఫాస్ట్ ర్యామ్ మరియు UFS 4.1 అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ Ricoh GR సపోర్ట్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక రియర్ కెమెరాని స్క్వేర్ లేదా సర్కిల్ మోడ్యూల్ తో స్విచ్ చేసే కొత్త ఫీచర్ కూడా అందించింది. ఈ ఫోన్ 7,000 mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ అవుతుంది మరియు ఈ భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 120W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందిస్తుంది. ఈ ఫోన్ రియల్ మీ GT బూస్ట్ 3.0 తో వస్తుంది.
Also Read: Samsung 55 ఇంచ్ Smart Tv పై జబర్దస్త్ డిస్కౌంట్ డీల్స్ ప్రకటించిన అమెజాన్.!
రియల్ మీ జిటి 8 ప్రో స్మార్ట్ ఫోన్ సిమ్మెట్రిక్ మాస్టర్ అకౌస్టిక్ డ్యూయల్ స్పీకర్లు మరియు అల్ట్రా హాప్టిక్ మోటార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే పెద్ద 7K అల్టిమేట్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా ఉంటుంది.