Realme GT Neo2: స్టన్నింగ్ డిజైన్ మరియు భారీ ఫీచర్లతో లాంచ్

Realme GT Neo2: స్టన్నింగ్ డిజైన్ మరియు భారీ ఫీచర్లతో లాంచ్
HIGHLIGHTS

Realme GT Neo2 స్మార్ట్ ఫోన్ విడుదల

స్టన్నింగ్ డిజైన్ మరియు భారీ ఫీచర్లతో లాంచ్

Realme ఈరోజు ఇండియాలో Realme GT Neo2 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది.  ఈ స్మార్ట్ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు భారీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. రియల్ మి ఈ స్మార్ట్ ఫోన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ E4 AMOLED మరియు 64MP AI ట్రిపుల్ కెమెరా వంటి చాలా గొప్ప ఫీచర్లతో అందించింది. ఈ ఫోన్ గురించిన అన్ని విషయాలను గురించి చూద్దామా.

Realme GT Neo2: ప్రైస్

రియల్‌మీ జిటి నియో2 స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ.31,999 రూపాయల ప్రారంభ ధరతో వచ్చింది. మరొక వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో రూ.35,999 ధరతో ప్రకటించబడింది. రియల్‌మీ జిటి నియో2 మొదటి సేల్ అక్టోబర్ 17 నుండి మొదలవుతుంది.

Realme GT Neo2:: స్పెక్స్

రియల్‌మీ జిటి నియో2 స్మార్ట్ ఫోన్ 6.62 ఇంచ్ FHD+  శాంసంగ్ E4 AMOLED డిస్ప్లే ని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 1300 నైట్స్ బ్రైట్నెస్ మరియు 600 టచ్ శాంప్లింగ్ రేట్ ని కలిగివుంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 3.2 Ghz క్లాక్ స్పీడ్ అందించగల  క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 5G SoC ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 12GB ర్యామ్ కూడా ఉంది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 64MP మైన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాగా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ కలిగి ఉంది. ఇక సెల్ఫీల కోసం 16MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ ఫోన్ Realme UI 2.0 స్కిన్ పైన Android 11 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 బ్యాటరీతో వచ్చింది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన డీల్స్ స్పీకర్ లతో కూడా వస్తుంది. అధనంగా, వేగంగా ఫోన్ ను చల్లబర్చడానికి స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ ఛాంబర్ ట్  వస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo