Ricoh GR కెమెరా కలిగిన మొదటి ఫోన్ Realme GT 8 Pro స్మార్ట్ ఫోన్.!
స్ట్రీట్ ఫోటోగ్రఫీ చరిత్రలో తనదైన వేసిన Ricoh GR కెమెరా సిస్టం ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో కూడా చేరుతోంది
ఈ ఘనత సాధించిన మొదటి ఫోన్ అందించిన కంపెనీ గా రియల్ మీ నిలుస్తుంది
Realme GT 8 Pro స్మార్ట్ ఫోన్ రికో జిఆర్ కెమెరా సెటప్ కలిగిన మొదటి ఫోన్ గా వస్తోంది
స్ట్రీట్ ఫోటోగ్రఫీ చరిత్రలో తనదైన వేసిన Ricoh GR కెమెరా సిస్టం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లలో కూడా చేరుతోంది. ఈ ఘనత సాధించిన మొదటి ఫోన్ అందించిన కంపెనీ గా రియల్ మీ నిలుస్తుంది. రియల్ మీ లాంచ్ చేయబోతున్న Realme GT 8 Pro స్మార్ట్ ఫోన్ రికో జిఆర్ కెమెరా సెటప్ కలిగిన మొదటి ఫోన్ గా వస్తోంది. ఈ ఫోన్ కోసం కంపెనీ అందించిన టీజర్ ద్వారా ఈ ఫీచర్ కన్ఫర్మ్ అయ్యింది. రియల్ మీ తీసుకొస్తున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ చేస్తున్న టీజింగ్ మరియు చెబుతున్న విశేషాలు ఏమిటో ఒక లుక్కేద్దామా.
SurveyRealme GT 8 Pro : లాంచ్
రియల్ మీ జిటి 8 ప్రో స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ను ముందుగా గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు చెబుతోంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. కానీ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన వీడియోలు మరియు ఇమేజెస్ తో ప్రత్యేకంగా టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ టీజింగ్ ను రియల్ మీ గ్లోబల్ అకౌంట్ నుంచి మాత్రమే అందించింది. దీని ద్వారా ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో ముందుగా లాంచ్ అవుతుందని చెబుతన్నారు.
Ricoh GR Camera Realme GT 8 Pro
రియల్ మీ 8 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రపంచ ప్రఖ్యాత రికో జిఆర్ ఫోటోగ్రఫీ ఫీచర్ తో జతగా వస్తుంది. ఈ విషయాన్ని రియల్ మీ వెల్లడించింది. ఈ ఫీచర్ సపోర్ట్ తో DSLR వంటి స్ట్రీట్ ఫోటోలు క్లిక్ చేసే అవకాశం ఉంటుంది. దీనికోసం ఇది హై క్వాలిటీ సెన్సార్ ఉపయోగిస్తుంది. కంపెనీ కొత్తగా విడుదల చేసిన టీజర్ ద్వారా ఈ విషయం క్లియర్ చేసింది.

ఈ అప్ కమింగ్ రియల్ మీ ఫోన్ రికో జిఆర్ యాంటీ గ్లేర్ మెయిన్ కెమెరా ఉంటుంది. అంతేకాదు ఈ కెమెరా డబుల్ లేయర్ AR కోటింగ్ తో ఉంటుంది. రికో జిఆర్ ఫిల్మ్ టోన్, రికో జిఆర్ మోడ్ మరియు రికో జిఆర్ పర్సనలైజేషన్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో రికో జిఆర్ కస్టమైజ్డ్ వాటర్ మార్క్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన 28mm / 40mm డ్యూయల్ ఫోకల్ లెంగ్త్ ఫీచర్ ఉంటుంది.
Also Read: iPhone 16 అమెజాన్ సేల్ బిగ్ డీల్స్ తో 60 వేల ఆఫర్ ప్రైస్ ధరలో లభిస్తోంది.!
స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో నడుస్తున్న కెమెరా వార్ ను మరింత పెంచేలా ఈ రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఉండవచ్చని జోశ్యం చెబుతున్నారు. ఇది రియల్ మీ ప్రీమియం సిరీస్ నుంచి లాంచ్ అయ్యే ఫోన్ కాబట్టి ఈ ఫోన్ స్క్రీన్, చిప్ సెట్ మరియు బ్యాటరీ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉండే అవకాశం ఉంటుందని కూడా జోశ్యం చెబుతున్నారు. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ కూడా త్వరలోనే రియల్ మీ వెల్లడించే అవకాశం ఉంది.