Realme GT 7T గ్లోబల్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!
Realme GT 7T స్మార్ట్ ఫోన్ యొక్క గ్లోబల్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా రివీల్ చేసింది
రియల్ మీ GT 7 స్మార్ట్ ఫోన్ తో పాటు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది
Realme GT 7T స్మార్ట్ ఫోన్ యొక్క గ్లోబల్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. నిన్నటి వరకు రియల్ మీ GT 7 లాంచ్ గురించి మాత్రమే టీజింగ్ చేసిన రియల్ మీ ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి లాంచ్ చేయనున్న రెండవ ఫోన్ గురించి కూడా టీజింగ్ మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ ఇమేజ్ తో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా రివీల్ చేసింది.
SurveyRealme GT 7T : లాంచ్
రియల్ మీ GT 7T స్మార్ట్ ఫోన్ ను కూడా రియల్ మీ GT 7 స్మార్ట్ ఫోన్ తో పాటు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ను కూడా ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేస్తోంది. ఈ ఎండు స్మార్ట్ ఫోన్ లను ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో నిర్వహిస్తున్న ప్రత్యేకమైన ఈవెంట్ నుంచి లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ ను భారత కాలమానం ప్రకారం మే 27వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.
Realme GT 7T : ఫీచర్స్
రియల్ మీ GT 7T స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ తో అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డీటెయిల్స్ వెల్లడయ్యాయి. ఈ ఫోన్ విలక్షణమైన పసుపు కలర్ రేసింగ్ వేరియంట్ లో కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక ఆకర్షణీయమైన గ్రాఫ్స్ కలిగి ఉన్నట్లు క్లియర్ గా కనిపిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ ప్రీమియం లెదర్ బ్యాక్ తో ఉన్నట్లు కన్ఫర్మ్ అవుతుంది.

ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ కెమెరా రియల్ మీ యొక్క హైపర్ ఇమేజ్ + సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా చాలా స్లీక్ గా ఉంది మరియు చూడచక్కని డిజైన్ వస్తుంది. ఈ ఫోన్ ను కూడా Next AI ఫీచర్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా రియల్ మీ కన్ఫర్మ్ చేసింది.
Also Read: Dance of Hillary Malware: ఈ వీడియో ఓపెన్ చేస్తే ఇక అంతే సంగతులు.!
రియల్ మీ అందించిన కొత్త లాంచ్ అప్డేట్ ద్వారా మే 27వ తేదీ రెండు ఫోన్ లను లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ కూడా త్వరగా వెల్లడించే అవకాశం ఉంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
