Dance of Hillary Malware: ఈ వీడియో ఓపెన్ చేస్తే ఇక అంతే సంగతులు.!

HIGHLIGHTS

భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పెరిగిన హై టెన్షన్

నేరుగా భారత్ ను ఏమి చేయలేని పాకిస్తాన్ మాల్వేర్ తో దాడి రచన చేసింది

ఈ కొత్త మాల్వేర్ వీడియోతో తస్మాత్ జాగ్రత్త

Dance of Hillary Malware: ఈ వీడియో ఓపెన్ చేస్తే ఇక అంతే సంగతులు.!

Dance of Hillary Malware: భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పెరిగిన హై టెన్షన్ ఇప్పుడు కొత్త రూట్స్ కూడా చేరుకుంది. నేరుగా భారత్ ను ఏమి చేయలేని పాకిస్తాన్, ఇప్పుడు భారతీయల మొబైల్స్ మరియు సిస్టం లను టార్గెట్ చేసుకొని కొత్త మాల్వేర్ తో దాడి రచన చేసింది. డాన్స్ ఆఫ్ హిల్లరీ వీడియో పేరుతో మాల్వేర్ వీడియో ఒకటి భారతీయులను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసింది. ఈ వీడియోను ఏ ప్లాట్ ఫామ్ లో ఓపెన్ చేసినా కూడా యూజర్ పర్సనల్ డేటా మరియు ఫైనాన్షియల్ డేటా ప్రమాదంలో పడుతుంది. అందుకే, ఈ కొత్త మాల్వేర్ వీడియోతో తస్మాత్ జాగ్రత్త అని ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అలర్ట్ జారీ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Dance of Hillary Malware:

భారత యూజర్ డేటా చోరీ కోసం పాకిస్తాన్ కొత్త డాన్స్ ఆఫ్ హిల్లరీ పేరుతో వీడియో మాల్వేర్ తో కొత్త తెర లేపినట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. భారత యూజర్ల పర్సనల్ మరియు ఫైనాన్షియల్ డేటాని చేజిక్కించుకోవడం ఈ కొత్త మాల్వేర్ లక్ష్యం. ఈ మాల్వేర్ ను వాట్సాప్ ద్వారా వ్యాప్తి చేస్తున్నట్లు కూడా ఈ నివేదికలు చెబుతున్నాయి.

Dance of Hillary Malware

కేవలం వాట్సాప్ మాత్రమే కాదు ఈ మాల్వేర్ ను ఫేస్ బుక్, టెలిగ్రామ్ మరియు మెయిల్ తో సహా చాలా ప్లాట్ ఫామ్స్ కి విస్తరించినట్లు కూడా ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అలర్ట్ జారీ చేసింది. ఈ డాన్స్ ఆఫ్ హిల్లరీ మాల్వేర్ అనేది వీడియో ఫైల్స్ లేదా డాక్యుమెంట్స్ ద్వారా విస్తరించే ఒక వైరస్. ఈ వీడియో లేదా డాక్యుమెంట్స్ ఓపెన్ చేయగానే ఈ వైరస్ డివైజ్ లలో విసరిస్తుంది మరియు యూజర్ యొక్క సున్నితమైన పర్సనల్ మరియు ఫైనాన్షియల్ డేటాని చోరీ చేస్తుంది.

ఈ మాల్వేర్ తో కేవలం డేటా తీసుకోవడమే కాదు పూర్తిగా డివైజ్ ను హ్యాకర్స్ చేతికి అందిస్తుంది. అందుకే, ఏదైనా అనుమానిత అకౌంట్ లేదా వీడియో లేదా మరింకేదైనా వాటిని ఓపెన్ చేసే ముందు ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేయడం మంచిది.

Also Read: India-Pak Conflict: భారత్ – పాక్ పోరు రియల్ వీడియోస్ పేరుతో వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందా.!

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

అన్నిటికన్నా ముందు, మీ ఫోన్ లేదా ఇంకేమైనా డివైజ్ ఉంటే అందులో ఆటోమేటిక్ డౌన్లోడ్ ను ఆఫ్ చేసువాలి. ముఖ్యంగా, ‘+92’ నుంచి వచ్చే ఏదైనా మెసేజ్, కాల్ లేదా మీడియా ఫైల్స్ ను అస్సలు నమ్మకూడదు. రీసెంట్ గా ఆన్లైన్ లో జాబ్ ఆశ చూపించి ఎక్కువగా ట్రాప్ చేస్తున్నారు. అటువంటి ఏదైనా మెసేజ్ వస్తే కూడా పక్కన పెట్టేయండి. మీ డివైజ్ మరియు అకౌంట్స్ కి చాలా కఠినమైన స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. మీకు అవసరమైన లేదా మీ డివైజ్ లో ఉన్న ముఖ్యమైన ఫైల్స్ ను బ్యాకప్ చేసుకోండి. ముఖ్యంగా, నమ్మకమైన సోర్స్ ల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ను మాత్రమే పరిగణలోకి తీసుకోండి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile