Realme GT 7 లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన రియల్ మీ: అంచనా ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
Realme GT 7 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను రియల్ మీ కన్ఫర్మ్ చేసింది
ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్ డేట్ మరియు టైమ్ ను ఈరోజు అనౌన్స్ చేసింది
టీజర్ వివరాలు మరియు అంచనా ప్రైస్ అండ్ ఫీచర్స్ పై లెక్కయండి
Realme GT 7 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు కలర్ వేరియంట్ ను తెలియ చేసే ఇమేజ్ ను కూడా పోస్ట్ చేసింది. ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్ డేట్ మరియు టైమ్ ను ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ Next AI సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేసింది. రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లంచ్ డేట్ మరియు ఈ ఫోన్ గురించి కంపెనీ అందించిన టీజర్ వివరాలు మరియు అంచనా ప్రైస్ అండ్ ఫీచర్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.
SurveyRealme GT 7 ఎప్పుడు లాంచ్ అవుతుంది?
రియల్ మీ జిటి 7 స్మార్ట్ ఫోన్ ను మే 72వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ ఫ్రాన్స్ లోని ప్యారిస్ లో జరుగుతుంది. ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ ఫీచర్స్ మరియు కలర్ వేరియంట్ వివరాలు కూడా తేటతెల్లం అయ్యాయి.
Realme GT 7 : ఫీచర్స్
రియల్ మీ జిటి 7 స్మార్ట్ ఫోన్ క్లియర్ ఇమేజ్ ను రివీల్ చేసింది. ఈ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ చైనాలో విడుదలైన అదే వేరియంట్ లాంచ్ చేయనున్నట్లు అర్ధం అవుతోంది. ఈ ప్రకారం ఈ ఫోన్ లో స్పెక్స్ ను అంచనా వేయడం చాలా సులభతరం అయ్యింది. ఈ ఫోన్ సూపర్ గేమ్ ప్లే అందించే 144Hz స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 9400+ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ఫోన్ మొట్టమొదటి గ్రాఫీన్ కవర్ ఐస్ సెన్స్ డిజైన్ ఫోన్ గా వస్తోంది. ఈ ఫోన్ చాలా వేగంగా చల్లబడే ఫీచర్ తో వస్తుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ పెద్ద మరియు పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ అవుతుందని రియల్ మీ తెలిపింది. చైనా వేరియంట్ లో 7200mAh టైటాన్ బ్యాటరీ మరియు 100W ఛార్జ్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ కూడా ఇదే బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Also Read: Flipkart Sale చివరి రోజు JBL Dolby సౌండ్ బార్ పై బిగ్ డీల్ అందుకోండి.!
Realme GT 7 : అంచనా ప్రైస్
రియల్ మీ జిటి 7 సిరీస్ నుంచి రీసెంట్ గా విడుదల చేసిన ప్రో వెర్షన్ ఫోన్ ధరతో ఈ ఫోన్ ధర అంచనా ధరను పోల్చి అంచనా వేస్తున్నారు. కొత్త అంచనాల ప్రకారం ఈ ఫోన్ ను రూ. 40,000 – రూ. 45,000 రూపాయల బడ్జెట్ ధరలో లాంచ్ చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లాంచ్ నాటికి ఈ ఫోన్ అందించిన అంచనా ధర మరియు ఫీచర్స్ లో నిజం ఎంతో తెలుస్తుంది.