Realme 5 సిరీస్ ఆగష్టు 20 న ఇండియాలో లాంచ్ కానుంది :

Realme 5 సిరీస్ ఆగష్టు 20 న ఇండియాలో లాంచ్ కానుంది :
HIGHLIGHTS

శామ్సంగ్ 64 MP ప్రాధమిక కెమెరాతో ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది

ఆగస్టు 20 న న్యూ ఢిల్లీ లో జరిగనున్న ఒక కార్యక్రమంలో రియల్మీ 5 సిరీస్ ఫోన్‌లను విడుదల చేయనున్నట్లు రియల్మి ప్రకటించింది. ఈ సంస్థ,ఈ సిరీస్ ఫోన్ల కోసం  “లీప్ టు క్వాడ్ కెమెరా” ట్యాగ్‌లైన్‌ను ఉపయోగిస్తోంది ఎందుకంటే ఈ సిరీస్‌లోని ఫోన్‌లు నాలుగు కెమేరాలతో రానున్న రియల్మి హ్యాండ్‌సెట్‌లుగా ఉంటాయి. ఇందులోని వెనుక కెమెరాలు, శామ్సంగ్ 64 MP  ప్రాధమిక కెమెరాతో ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అయితే,  ఈ ఫోన్ అదే కావచ్చని అనిపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా రిటైల్ అవుతాయి మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఇప్పటికే ‘రియల్‌మే 5’ సిరీస్‌ యొక్క టీజర్ అందించింది.

ఫ్లిప్‌కార్ట్‌ నుండి లభించే సమాచారం ప్రకారం, ఈ ఫోన్‌లో ప్రాధమిక లెన్స్‌తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, అది “పెద్ద ఎపర్చరు మరియు పిక్సెల్ సైజు” తో “ఖచ్చితమైన” తక్కువ-కాంతి చిత్రాలను తీయడంలో సహాయపడుతుంది. అయితే,  రియల్మి 5 సిరీస్ ఫోన్‌లకు 64 ఎంపి సెన్సార్ ఉంటుందని కచ్చితంగా నిర్ధారించలేదు. 119-డిగ్రీల ఫీల్డ్ వ్యూతో అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు ఇతర లెన్స్‌లతో పోలిస్తే 1.5 రెట్లు ఎక్కువ ప్రాంతాన్ని మాత్రం సంగ్రహిస్తుందని పేర్కొన్నారు. సూపర్ మాక్రో లెన్స్ 4 సెం.మీ మైక్రోస్కోపిక్ ఫోకల్ లెంగ్త్ ఈ ఫోన్ కలిగి ఉంటుందని పేర్కొంది. పోర్ట్రెయిట్ చిత్రాలను క్లిక్ చేయడానికి నాల్గవ లెన్స్ గా ఇది  ఉపయోగించబడుతుంది.

ఇటీవల, రియల్మి తన కెమెరా టెక్ ని ప్రదర్శించడానికి ఒక బ్రీఫింగ్ కూడా నిర్వహించింది. 64MP రిజల్యూషన్ ఉన్న శామ్‌సంగ్ బ్రైట్ జిడబ్ల్యు 1 సెన్సార్‌తో రియల్మి  ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు గతంలో షెత్ ప్రకటించారు మరియు చిత్రాలను తీయడానికి కంపెనీ ఐసోసెల్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది అని కూడా అన్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo