Realme X2 Pro తోపాటుగా లాంచ్ కానున్న Realme 5 s స్మార్ట్ ఫోన్

Realme X2 Pro తోపాటుగా లాంచ్ కానున్న Realme 5 s స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

ఈ హ్యాండ్‌ సెట్ 48MP ప్రైమరీ సెన్సార్‌ తో వెనుక ఒక క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

తాజా అప్డేట్స్  ప్రకారం, రియల్మి 5 S నవంబర్ 20 న విడుదలకానున్న రియల్మి X 2 ప్రో తో పాటు భారతదేశంలో విడుదలవడానికి సిద్ధంగా ఉన్నట్లు ధృవీకరించబడింది. అంతేకాదు, రియల్మి 5 S కోసం ఫ్లిప్‌ కార్ట్‌ లో ఒక కొత్త మైక్రోసైట్ పేజీ కూడా LIVE చెయ్యబడింది. ఈ హ్యాండ్‌ సెట్ 48MP ప్రైమరీ సెన్సార్‌ తో వెనుక ఒక క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని ఇది సూచిస్తుంది.

రియల్మి 5 ఎస్, ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన రియల్మి 5 యొక్క అప్‌ గ్రేడ్ వెర్షన్ గా అంటుంది. ఇది ఇప్పటికే భారతదేశంలో తప్పనిసరి BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ మరియు థాయ్‌లాండ్‌లోని NBTC (నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమిషన్) సర్టిఫికేషన్నుపొందింది, ఈ హ్యాండ్‌సెట్ త్వరలో రెండు దేశాల్లో ప్రారంభించవచ్చని, ఈ అప్డేట్ చెబుతోంది.

రియల్మి 5 ఎస్ ఒక 6.5-అంగుళాల HD + (720×1600 పిక్సెల్స్) డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 4GB RAM తో జతగా చేసిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌ సెట్ శక్తితో అందివ్వగలదు. ఈ స్మార్ట్‌ ఫోన్ 48MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. ఏదేమైనా, ఇతర మూడు సెన్సార్ల యొక్క ఖచ్చితమైన లక్షణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇంకా, రియల్మి 5 S ముందుభాగంలో ఒక 13MP సెల్ఫీ షూటర్ కలిగి ఉంటాయి. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ప్యాక్ చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo