realme C85 5G : రియల్ మీ బడ్జెట్ సిరీస్ నుంచి ఈరోజు కొత్త ఫోన్ విడుదల చేసింది. అదే రియల్ మీ సి 85 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను ఈరోజు నుంచే సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. ఈ ఫోన్ అండర్ 15K ప్రైస్ సెగ్మెంట్ లో IP 69 రేటింగ్ మరియు 144Hz హై రిఫ్రెష్ రేట్ స్క్రీన్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ చేయడమే కాకుండా ఈరోజు నుంచి ఈ ఫోన్ సేల్ కూడా స్టార్ట్ చేసింది.
Survey
✅ Thank you for completing the survey!
Realme C85 5G: లాంచ్ ప్రైస్
రియల్ మీ సి 85 స్మార్ట్ ఫోన్ బేసిక్ (4 జీబీ + 128 జీబీ) వేరియంట్ రూ. 14,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ హై ఎండ్ (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ రూ. 16,499 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ బోనస్ మరియు రూ. 500 రూపాయల కూపన్ ఆఫర్ ఈ ఫోన్ పై అందించింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు రియల్ మీ అధికారిక వెబ్ సైట్ నుంచి సేల్ అవుతోంది. ఈ ఫోన్ ప్యారెట్ పర్పల్ మరియు పీకాక్ గ్రీన్ రెండు రంగుల్లో లభిస్తుంది. లాంచ్ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 11,499 ఆఫర్ ధరలో అందుకోవచ్చు.
రియల్ మీ సి 85 స్మార్ట్ ఫోన్ 6.8 ఇంచ్ HD+ రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఇందులో 4 జీబీ / 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది.
ఈ ఫోన్ వెనుక 50 MP మెయిన్ మరియు మరో సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ IP69 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో మంచి వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుందని రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జ్ మరియు 6.5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.