Google Pixel 10 పై ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ భారీ డీల్స్ అందుకోండి.!
Google Pixel 10 స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది
ఈ సేల్ ఈ రోజు తో ముగుస్తుంది కాబట్టి ఈ బిగ్ డీల్ అందుకోవాలంటే ఈరోజు మీకు చివరి రోజు అవుతుంది
ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈ డీల్స్ అందించింది
Google Pixel 10 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రీసెంట్ గా విడుదలైన గూగుల్ ఫోన్ మరియు ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి ఈ డీల్స్ అందించింది. ఈ సేల్ ఈ రోజు తో ముగుస్తుంది కాబట్టి ఈ బిగ్ డీల్ అందుకోవాలంటే ఈరోజు మీకు చివరి రోజు అవుతుంది. మరి ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి గూగుల్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన ఆ బిగ్ డీల్స్ ఏమిటో చూద్దామా.
SurveyGoogle Pixel 10: ఆఫర్
గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ భారత్ మార్కెట్లో రూ. 79,999 రూపాయల ధరలో లాంచ్ అయ్యింది మరియు ఈ ఫోన్ ఈ రోజు కూడా ఇదే ధరతో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై రెండు బిగ్ డీల్స్ అందించింది. అవేమిటంటే, గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ పై రూ. 5,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 7,000 డిస్కౌంట్ ఆఫర్. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 67,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
Google Pixel 10: ఫీచర్స్
గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్ ఫోన్ గూగుల్ యొక్క కొత్త Tensor G5 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఇది TSMC 3nm ప్రాసెస్ పై రూపొందించబడింది. డిజైన్ పరంగా, సన్నగా మరియు అల్ట్రా ప్రీమియం ఫినిష్‌తో ఉంటుంది. ఇక ఈ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే, ఇది 6.3 ఇంచ్ LTPO OLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 1Hz–120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2000 కంటే అధిక నిట్స్ బ్రైట్‌నెస్ మరియు HDR సపోర్ట్ కలిగి ఉండటమే కాకుండా గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కూడా కలిగి ఉంటుంది.

ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ కెమెరా ఈ ఫోన్ లో ప్రధాన హైలెట్ గా ఉంటుంది. ఈ ఫోన్ ముందు మరియు వెనుక కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో వెనుక 48MP మెయిన్, 13MP అల్ట్రా వైడ్ మరియు 10.8MP టెలీఫోటో సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా తో పాటు ముందు 10.5MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో టన్నుల కొద్దీ కెమెరా ఫీచర్స్ మరియు గూగుల్ జెమినీ ప్రీమియం యాక్సెస్ తో కూడిన AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: లేటెస్ట్ ZEBRONICS 1100 Dolby Atmos సౌండ్ బార్ పై 10 వేల భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ఈ గూగుల్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్, మరియు పిన్, ప్యాట్రన్ అన్లాక్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ Crisis Alerts, కార్ క్రాష్ డిటెక్షన్ సేఫ్టీ చెక్ ఎమర్జెన్సీ SOS వంటి అత్యవసర ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4970 mAh బిగ్ బ్యాటరీ, 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ మరియు 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.