Realme C71: 7 వేల బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ లాంచ్ చేసిన రియల్ మీ.!
ఈరోజు రియల్ మీ 8 వేల బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ ను స్లీక్ డిజైన్ మరియు బిగ్ బ్యాటరీ తో అందించింది
ఈ ఫోన్ గరిష్టంగా 18 జీబీ డైనమిక్ ర్యామ్ కూడా కలిగి ఉంటుంది
Realme C71: రియల్ మీ బడ్జెట్ సిరీస్ నుంచి ఈరోజు కావెల్మ్ 8 వేల బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే, రియల్ మీ సి 71 స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను స్లీక్ డిజైన్ మరియు బిగ్ బ్యాటరీ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా వచ్చింది. రియల్ మీ ఈరోజే సరికొత్తగా విడుదల చేసిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ చూద్దామా.
SurveyRealme C71: ధర
రియల్ మీ సి 71 5జి స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (4 జీబీ + 64 జీబీ) ను రూ. 7,699 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ (6 జీబీ +128 జీబీ) ను రూ. 8,699 ధరతో అందించింది. ఈ ఫోన్ ను ఈరోజు నుంచే సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, ఈ ఫోన్ ఫస్ట్ ఫస్ట్ జులై 17 వ తేదీ అర్ధరాత్రి 11 గంటల 59 నిమిషాలకు ముగుస్తుంది. ఈ ఫోన్ సి బ్లూ మరియు ఒడిసియన్ బ్లాక్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు రియల్ మీ అఫీషియల్ సైట్ నుండి లభిస్తుంది.
ఫస్ట్ సేల్ ఆఫర్:
ఈ ఫోన్ రియల్ మీ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ ను ప్రధాన బ్యాంక్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 700 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 7,999 రూపాయల ధరతో లభిస్తుంది.
Also Read: Flipkart GOAT Sale: 43 ఇంచ్ టీవీ రేటుకే 55 ఇంచ్ Smart Tv అందుకోండి.!
Realme C71: ఫీచర్లు
రియల్ మీ సి 71 స్మార్ట్ ఫోన్ HD రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.74 ఇంచ్ డిస్ప్లేతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను కేవలం 7.9mm మందంతో చాలా స్లీక్ డిజైన్ తో అందించింది . ఈ ఫోన్ పల్స్ లైట్ డిజైన్ తో ఈ ఫోన్ ను 9 రంగుల్లో మెరిసేలా అందించింది. ఈ ఫోన్ ను 2 లక్షల 80 వేల AnTuTu స్కోర్ కలిగిన 12nm ఆక్టా కోర్ చిప్ సెట్ తో అందించింది మరియు ఇది 4G స్మార్ట్ ఫోన్ గా వచ్చింది. ఈ ఫోన్ లో 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది. ఈ ఫోన్ గరిష్టంగా 18 జీబీ డైనమిక్ ర్యామ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు వాటర్ డ్రాప్ నోచ్ లో సెల్ఫీ కెమెరా అందించింది. ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్స్ మరియు AI సర్కిల్ సెర్చ్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 15 W ఫాస్ట్ ఛార్జ్ మరియు 5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6300mAh బిగ్ బ్యాటరీతో అందించింది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉండడమే కాకుండా మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.