సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా డ్యూయల్ సెల్ఫీతో రియల్మీ 6 సిరీస్ వచ్చేస్తోంది

సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా డ్యూయల్ సెల్ఫీతో రియల్మీ 6 సిరీస్ వచ్చేస్తోంది
HIGHLIGHTS

ఈ ఫోన్ల నుండి మంచి ఫీచర్లను ఆశించవచ్చు.

రియల్మీ సంస్థ, ఇప్పటికే ఇండియాలో మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన గహనతను దక్కించుకుంది. అంతేకాదు, తన స్మార్ట్ ఫోన్లను కొత్త టెక్నాలజీతో వెంట వెంటనే ఇండియాలో విడుదల చేస్తున్న సంస్థగా నిలుస్తోంది. ఇటీవలే, మొట్ట మొదటి 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన ఈ సంస్థ, మరొక రెండు స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయడానికి డేట్ ని ప్రకటించింది. అంతేకాదు, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ని రియల్మీ సంస్థ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ప్రకటించింది.

త్వరలో ఇండియాలో లాంచ్ చేయనున్న ఈ రియల్మీ 6 సిరీస్ నుండి రియల్మీ 6 మరియు రియల్మీ 6 ప్రో ని కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇక ఇందులో అందించనున్న ఫీచర్ల పరంగా చూస్తే, ఇందులో ఒక 64MP క్వాడ్ కెమేరాని ఇవ్వనున్నట్లు, అదీకూడా 64MP ప్రో కెమేరా అని గొప్పచెబుతుండడం చూస్తుంటే, కెమేరాల పరంగా కొత్త మార్పులు ఏమైనా చేయొచ్చేమో అని అనిపిస్తుంది.

ఇక ఈ ఫోన్ యొక్క లాంచ్ టీజ్ ఇమేజి ప్రకారంగా, ఇది ఒక డ్యూయల్ ఇన్ స్క్రీన్ (పంచ్ హోల్ ) సెల్ఫీ కెమేరాతో విడుదల చేయనున్నట్లు అర్ధమవుతోంది. అయితే, ఇక్కడే అందరికి ఒక సందేహం రావచ్చు. అదేమిటంటే, ఈ టీజ్ ఇమేజి రియల్మీ 6 ఫోనుదా లేక రియల్మీ 6 ప్రో కి సంబంచినదా అనుకోవచ్చు. ఈ విషయం గురించి ఫోన్లు విడుదలయ్యే వరకూ సస్పెన్స్ కావచ్చు. అయితే, ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అందేమిటంటే, రియల్మీ ఇప్పటి వరకూ ఇండియాలో లాంచ్ చేసిన స్మార్ట్ న్లన్నీ కూడా తక్కువ ధరలో అడ్వాన్స్ ఫీచర్లతో వచ్చినవే కాబట్టి, ఈ ఫోన్ల నుండి మంచి ఫీచర్లను ఆశించవచ్చు.                     

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo