Realme 7వ యానివర్సరీ సేల్ నుంచి Realme GT 7 Pro పై 10 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.!
Realme GT 7 Pro పై 10 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్
Realme 7వ యానివర్సరీ సేల్ నుంచి ఈ జబర్దస్ డీల్ అందించింది
యానివర్సరీ సేల్ నుంచి రియల్ మీ ప్రొడక్ట్స్ పై గొప్ప డీల్స్ అందించింది.
Realme 7వ యానివర్సరీ సేల్ నుంచి Realme GT 7 Pro పై 10 వేల రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. రియల్ మీ 2025 లో 7వ వార్షికోత్సవం జరుపుకుంటోంది మరియు ఈ సందర్భంగా తీసుకువచ్చిన యానివర్సరీ సేల్ నుంచి రియల్ మీ ప్రొడక్ట్స్ పై గొప్ప డీల్స్ అందించింది. ఈ సేల్ లో భాగంగా ఇటీవల విడుదలైన రియల్ మీ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ రియల్ మీ GT 7 Pro పై ఈ జబర్దస్ డీల్స్ అందించింది.
SurveyRealme GT 7 Pro : సేల్ ఆఫర్
రియల్ మీ జిటి 7 ప్రో స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 59,999 రూపాయల ప్రారంభం ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ప్రస్తుతం రియల్ మీ అనౌన్స్ చేసిన రియల్ మీ 7వ యానివర్సరీ సేల్ నుంచి రూ. 7,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో ఈ ఫోన్ రూ. 52,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 3,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

బ్యాంక్ ఆఫర్స్ విషయానికి వస్తే, ICICI డెబిట్/క్రెడిట్, HDFC డెబిట్/క్రెడిట్, SBI డెబిట్/క్రెడిట్, Axis డెబిట్/క్రెడిట్ మరియు Kotak డెబిట్/క్రెడిట్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి ఈ రూ. 3,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 49,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకునే అవకాశం ఉంటుంది. realme.com నుంచి ఈ ఫోన్ ఈ ఆఫర్స్ తో సేల్ అవుతోంది.
Realme GT 7 Pro : ఫీచర్స్
ఇది రియల్ మీ రీసెంట్ గా విడుదల చేసిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను క్వాల్కమ్ లేటెస్ట్ ప్రీమియం చిప్ సెట్ Snapdragon 8 Elite తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క హైఎండ్ వేరియంట్ 16GB ర్యామ్ మరియు 512GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 6.78 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ ను ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1.5k రిజల్యూషన్ మరియు 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5800mAh బిగ్ బ్యాటరీ మరియు 120W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: iQOO Neo 10 స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన ఐకూ.!
ఈ రియల్ మీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా సెటప్ లో 50MP పెరిస్కోప్ కెమెరా, 50MP Sony IMX906 ప్రధాన సెన్సార్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటాయి. ఈ ఫోన్ 24fps వద్ద 8K వీడియో రికార్డింగ్ మరియు 30fps/60fps వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు IP69 రేటింగ్ తో వస్తుంది.