అనుకోకుండా Realme 5 యొక్క సేల్ ఈరోజే మొదలు పెట్టిన Realme సంస్థ

అనుకోకుండా Realme 5 యొక్క సేల్  ఈరోజే మొదలు పెట్టిన  Realme సంస్థ
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అన్ని వేరియంట్లు కూడా ఓపెన్ సేల్ ద్వారా అమ్ముడవుతున్నాయి.

కేవలం రూ. 9,999 ప్రారంభ ధరలో రియల్మీ ఇండియాలో విడుదల చేసినటువంటి Realme 5 యొక్క ప్రీ ఆర్డర్స్ ఈ రోజుతో ముగుస్తుండగా, అనుకోకుండా ఓపెన్  సేల్ ద్వారా ఈ హ్యాండ్ సెట్ యొక్క అమ్మకాలను మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అన్ని వేరియంట్లు కూడా ఓపెన్ సేల్ ద్వారా అమ్ముడవుతున్నాయి. అయితే, రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లాష్ సేల్ ఉండగా అనుకోకుండా ఈ సేల్ LIVE చెయ్యడం పొరపాటుగా జరిగిందో లేక అమ్మకాలను ముందుగానే కొనసాగించాడనికి ఇలా చేసిందో ఇంకా మాత్రం తెలియ రాలేదు.            

Realme 5 ధరలు

1. Realme 5  (3GB + 32GB) ధర – Rs.9,999

2. Realme 5  (4GB + 64GB) ధర – Rs.10,999

3. Realme 5  (4GB + 128GB) ధర – Rs.11,999     

Realme 5 :  ప్రత్యేకతలు

రియల్మీ సంస్థ,  ఈ Realme 5 స్మార్ట్ ఫోన్ ఒక 6.5 అంగుళాల మినీ డ్రాప్ డిజైన్ డిస్ప్లేతో వస్తుంది. ఈ అతి చిన్నని నోచ్ డిజైనులో,  సెల్ఫీల కోసం సెల్ఫీ కెమేరాని ఇందులో అందించింది.  అలాగే ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 3+ రక్షణతో అందించబడినది. ఈ స్మార్ట్ఫోన్ 89 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. అలాగే, వెనుక భాగంలో సరికొత్తగా ఒక క్రిస్టల్ డిజైన్ అందించింది. ఇందులో 10 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ ఒక స్నాప్డ్రాగెన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసరుతో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా, 2.0GHz వరకు క్లాక్ స్పీడును అందిస్తుంది దీని జతగా 3GB/4GB ర్యామ్ మరియు 32GB /64GB /128GB స్టోరేజి ఎంపికలతో ఎంచుకోవచ్చు.  

ఈ  స్మార్ట్ ఫోను యొక్క వెనుక భాగంలో ఒక క్వాడ్ కెమేరా సెటప్పును  అందించింది. ఒక ప్రధాన 12MP కెమేరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా ఇందులో వ్వబడింది. అలాగే, ఇది 8MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కి జతగా 2MP మాక్రో కెమేరా కలిగి ఉంది. ఈ కెమెరాలో అందించిన కెమేరాతో 10X డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ముందు కెమెరా విషయానికి వస్తే, 13 MP  సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది క్రిస్టల్ బ్లూ , క్రిస్టల్పర్పల్  వంటి రెండు రంగుల ఎంపికలతో లభిస్తుంది. ఈ ఫోన్, కలర్ OS 6 స్కిన్ తో ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo