Realme 9i 5G: గొప్ప డిజైన్ మరియు ఫీచర్లతో వచ్చింది..!

Updated on 18-Aug-2022
HIGHLIGHTS

రియల్ మీ సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ Realme 9i 5G లాంచ్

గొప్ప డిజైన్ మరియు మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశించింది

రియల్ మీ 9i 5G రెండు వేరియంట్లలో లభిస్తుంది

రియల్ మీ ఇండియాలో 9 సిరీస్ నుండి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ Realme 9i 5G ని ఈరోజు లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ 5G ప్రాసెసర్, గొప్ప డిజైన్ మరియు మరిన్ని ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశించింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ధరను మాత్రం బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని సెట్ చేసినట్లు కనిపిస్తోంది. రియల్ మీ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ కంప్లీట్ వివరాలను తెలుసుకోండి.

Realme 9i 5G: ధర మరియు ఆఫర్లు

రియల్ మీ 9i 5G రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు ICICI బ్యాంక్ అఫర్ తో వచ్చింది. ఈ వేరియట్ల ధరలు క్రింద అందించబడ్డాయి.

1. Realme 9i 5G(4GB + 64GB) : ధర రూ.14,999/-

2.  Realme 9i 5G(6GB  + 128GB) : ధర రూ.16,999/-

ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు realme.com నుండి ఆగష్టు 24న మధ్యాహ్నం 12 గంటలకి మొదటిసారి సేల్ కి వస్తుంది.

Realme 9i 5G: స్పెక్స్

రియల్ మీ 9i 5G స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD+ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180 Hz టచ్ శాంప్లింగ్ కలిగి వుంటుంది. ఈ ఫోన్ 8.1 mm మందంతో సన్నని మరియు లేజర్ లైట్ డిజైన్ తో కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 6GB ర్యామ్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ రాకింగ్ బ్లాక్ మరియు మెటాలికా గోల్డ్ అనే రెండు కలర్ లలో లభిస్తుంది.      

ఇక కెమెరాల విషయానికి వస్తే, Realme 9i స్మార్ట్ ఫోన్ వెనుక ఆకర్షణీయమైన డిజైన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP మైన్ కెమెరాకి జతగా 2MP పోర్ట్రైట్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. అలాగే, సెల్ఫీల కోసం 8MP AI సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది.

సెక్యూరిటీ పరంగా, ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది మరియు ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా Realme UI 3.0 సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :