Realme 9: భారీ 108MP కెమెరా మరియు సూపర్ AMOLED డిస్ప్లే తో వచ్చింది..!!
రియల్ మీ ఈరోజు ఇండియాలో Realme 9 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది
సూపర్ AMOLED డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్లతో వచ్చింది
రియల్ మీ 9 లో 108ఎంపి భారీ కెమెరా సెట్టింగ్
రియల్ మీ ఈరోజు ఇండియాలో Realme 9 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 108ఎంపి భారీ కెమెరా మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్లతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ Realme 5G యొక్క 4G వెర్షన్ అయినా కూడా ఫీచర్లను మాత్రం ఏమాత్రం తగ్గకుండా అందించింది. మరి ఈరోజే మార్కెట్లో అడుగుపెట్టిన ఈ రియల్ మీ 4G స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు మరియు స్పెక్స్ ఏమిటో తెలుసుకుందామా.
SurveyRealme 9: ధర మరియు ఆఫర్లు
రియల్ మీ 9 రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు HDFC బ్యాంక్ అఫర్ తో వచ్చింది. ఈ వేరియట్ల ధరలు మరియు అఫర్ వివరాలు క్రింద అందించబడ్డాయి.
1. Realme 9 (6GB + 128GB) : ధర రూ.17,999/-
2. Realme 9 (6GB + 128GB) : ధర రూ.18,999/-
ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు realme.com నుండి భారీ అఫర్ తో ఏప్రిల్ 12 న మొదటిసారి సేల్ కి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 2000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, డిస్కౌంట్ తో కేవలం రూ.15,999 రూపాయల ప్రారంభ ధరలో ఈ స్మార్ట్ ఫోన్ ను పొందవచ్చు.
Realme 9: స్పెక్స్
రియల్ మీ 9 స్మార్ట్ ఫోన్ 6.4 ఇంచ్ FHD+ (1080×2400) రిజల్యూషన్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 360 Hz టచ్ శాంప్లింగ్ కలిగి వుంటుంది. ఈ ఫోన్ కేవలం 7.99mm మందంతో సన్నని డిజైన్ తో కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 8GB ర్యామ్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ సన్ బరస్ట్ బస్ట్ గోల్డ్, స్టార్ గేజ్ వైట్ మరియు మేటోర్ బ్లాక్ అనే మూడు కలర్ లలో లభిస్తుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే, Realme 9 స్మార్ట్ ఫోన్ వెనుక ఆకర్షణీయమైన డిజైన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 108MP Samsung HM6 సెన్సార్ కలిగిన మైన్ కెమెరాకి జతగా 8MP సూపర్ వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. అలాగే, సెల్ఫీల కోసం 16MP AI సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 33W సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద 5000 mAh బ్యాటరీతో వస్తుంది.
సెక్యూరిటీ పరంగా, ఈ ఫోన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది మరియు ఇది హార్ట్ రేట్ మోనిటర్ ఫీచర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా Realme UI 3.0 సాఫ్ట్ వేర్ పైన
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile