Realme 9 Pro Series: ఫిబ్రవరి 16 న వస్తున్న రియల్ మి కొత్త ఫోన్లు

HIGHLIGHTS

Realme 9 Pro సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ డేట్ ను రియల్ మి ప్రకటించింది

Realme 9 Pro Series: ఫిబ్రవరి 16 న వస్తున్న రియల్ మి కొత్త ఫోన్లు

Realme 9 Pro సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ డేట్ ను రియల్ మి ప్రకటించింది. ఈ సిరీస్ ను ఇండియాలో ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 1:30 గంటలకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సిరీస్ నుండి తీసుకువస్తున్న Realme 9 Pro+ గురించి ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ను SonyIMX 766 సెన్సార్ ను OIS సపోర్ట్ తో మరియు Dimensity 920 5G ప్రాసెసర్ తో తీసుకువస్తునట్లు టీజ్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అంతేకాదు, ఈ ఫోన్ గురించి కంపెనీ CEO మాధవ్ సేథ్ ముందుగా చేసిన ట్వీట్ ద్వారా Realme 9 Pro+ 5G స్మార్ట్ ఫోన్ హార్ట్ రేట్ సెన్సార్ తో వస్తున్నట్లు కూడా వెల్లడయ్యింది. వీటిని బట్టి చూస్తుంటే Realme 9 Pro + భారీ ఫీచర్లతో మార్కెట్లో అడుగుపెట్టేలా కనిపిస్తోంది.   

Realme 9 Pro+ 5G స్మార్ట్ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుందని, ఇది హార్ట్ రేట్ ను స్కానర్ కూడా పనిచేస్తుందని మాధవ్ సేథ్ ధ్రువీకరించారు. దీనికోసం, వినియోగదారులు వారి వేలును స్కానర్ పైన నొక్కిపట్టి ఉంచిన తరువాత రీడింగ్స్ ని స్క్రీన్ పైన చూడవచ్చని తెలిపారు.

ఇక Realme 9 Pro+ మరిన్ని వివరాల కోసం చూస్తే, ఇందులో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 119-డిగ్రీ FOVతో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందువైపు 16MP సెల్ఫీ కెమెరా ఉంది. Realme 9 Pro+ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,500mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo