[Exclusive] Realme 8i మీడియాటెక్ Helio G96 తో వస్తున్నమొదటి ఫోన్: వెల్లడించిన లీక్ రెండర్లు
Realme 8i మీడియాటెక్ హీలియో G96 SoC తో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్
రియల్‌మీ 8i 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన 120Hz డిస్ప్లే తో వస్తుంది
Realme 8i 50ఎంపి కెమెరా, 5000mAh బ్యాటరీ కలిగి వుంది
రియల్‌మీ 8i అతిత్వరలోనే భారతదేశంలో విడుదలకానుంది. అయితే, ఈ అప్ కమింగ్ రియల్‌మీ స్మార్ట్ ఫోన్ గురించి ఎక్స్ క్లూసివ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మావద్ద వుంది. రియల్‌మీ 8i మరియు రియల్‌మీ 8s రెండు ఫోన్లు కూడా ఈనెల ప్రారంభంలో విడుదలైన AskMadhav 28 ఎపిషోడ్ లో రియల్‌మీ సీఈవో మాధవ్ సేథ్ టీజ్ చేసారు. రియల్‌మీ 8 s గురించి కూడా గతంలో కొన్ని లీక్స్ వచ్చాయి కానీ ఇప్పటి వరకు రియల్‌మీ 8i గురించి మాత్రం ఎటువంటి ఖచ్చితమైన సమాచారం లేదు.
SurveyDigit.in తో ఎక్స్ క్లూజివ్ పార్ట్నర్ షిప్ తో, ప్రముఖ టిప్‌స్టర్ OnLeaks మాకు Realme 8i యొక్క రెండర్‌లు మరియు కీలక స్పెసిఫికేషన్‌లను అందించింది. Realme 8i అనేది రియల్‌మీ 8 లైనప్‌లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. అంతేకాదు, ఇది చాలా సరసమైన ఫోన్‌గా వస్తుందని భావిస్తున్నారు. Realme 8s గతంలో MediaTek Dimensity 810 ప్రాసెసర్‌తో లీక్ చేయబడినప్పటికీ, ఇంతకు ముందు జూలైలో లాంచైన Helio G96 చిప్ శక్తితో పనిచేసే మొట్టమొదటి ఫోన్‌గా రావడానికి Realme 8i సిద్ధంగా ఉందని ఈ రోజు మనం ఖచ్చితంగా నిర్ధారించవచ్చు.
రియల్‌మీ 8i డిజైన్, ఫీచర్లు మరియు ఈ ఫోన్ గురించి మీరు తెల్సుసుకోవాల్సిన ప్రతి విషయం ఇక్కడ మీరు చూడవచ్చు.
Realme 8i లీక్డ్ రెండర్లు
హై రిజల్యూషన్ ఇమేజీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
లీక్ చెయ్యబడిన రెండర్స్ ప్రకారం, రియల్‌మీ 8i వెనుక భాగంలో గ్రేడియంట్ డిజైన్ మరియు కర్వ్డ్ ఎడ్జెస్ కలిగి గ్లాస్సి ఫినిషింగ్ కలిగి వుంది. వెనుక వైపు ఉన్న కెమెరా మాడ్యూల్ లో ఒక ఫ్లాష్ మరియు ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది.
సైడ్ లో పవర్ బటన్ మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ గా పనిచేసే బటన్ ఉంది మరియు కుడివైపు అడుగుభాగంలో టైప్-C పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్ లను చూడవచ్చు.
లీకైన Realme 8i స్పెషిఫికేషన్స్
రియల్‌మీ 8i ఒక 6.59 అంగుళాల FHD డిస్ప్లే కలిగివుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. పైన ఎడమవైపున మూలలో పంచ్ హోల్ నాచ్ కటౌట్ వుంది. ఈ ఫోన్ 8.6 mm మదం మరియు 194 గ్రాముల బరువుతో వుంది. ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ప్లాస్టిక్ బాడీని కలిగివుందని భావిస్తున్నారు.
ఈ ఫోన్ రెండు 2.05GHz వరకు క్లాక్ స్పీడ్ కలిగిన Cortex- A76 కోర్‌లు, ఆరు Cortex- A55 కోర్‌లు మరియు Mali- G57 MC2 GPU తో జత చేయబడిన MediaTek Helio G96 ప్రోసెసర్ శక్తితో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 4GB RAM మరియు 128GB UFS 2.2 స్టోరేజ్ ఉన్నాయి.
ఇక వెనుకభాగంలో 50MP మైన్ కెమెరా, 2MP పోర్ట్రయిట్ సెన్సార్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. అలాగే ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
రియల్‌మీ 8i లో 5,000 mAh బిగ్ బ్యాటరీని కలిగి వుంది మరియు ఇది అవుట్-ఆఫ్-ది బాక్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు ఛార్జర్ తో వచ్చే అవకాశం ఉంది.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

