రియల్మి 8 ప్రో VS మోటో G60: కంపేరిజన్

రియల్మి 8 ప్రో VS మోటో G60: కంపేరిజన్
HIGHLIGHTS

రెండు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు

Realme 8 Pro vs Moto G60 స్మార్ట్ ఫోన్

ఎటువంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం

లేటెస్ట్ గా రెండు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు 108MP కెమెరా సెటప్పుతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించాయి. ఈ రెండు ఫోన్లు కూడా చాలా ట్రెండీ ఫీచర్లను కలిగి ఉంటాయి. అంతేకాదు, వీటి ధర పరంగా కూడా 20 వేల కంటే తక్కువ ధరలో మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఉంటాయి.  వీటిలో ఒకటి Realme యొక్క Realme 8 Pro కాగా మరొకటి Moto G60 స్మార్ట్ ఫోన్. అందుకే, ఈ రెండు ఫోన్లను సరిపోల్చి వీటిలో ఎటువంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం.             

Price: 

Realme 8 Pro :  ధర

1. Realme 8 Pro (6GB + 128GB) ధర – Rs.17,999

2. Realme 8 Pro (8GB + 128GB) ధర – Rs.19,999

Moto G60 :  ధర

1. Moto G60 (6GB + 128GB) ధర – Rs.17,999

డిస్ప్లే :

డిస్ప్లే విభాగంలో, ఈ రెండు స్మార్ట్ ఫోన్ల డిస్ప్లే లలో చాలా తేడాలు ఉన్నాయి. ఎందుకంటే, రియల్మి 8 ప్రో 6.4-ఇంచ్ పంచ్ హోల్  డిజైన్ గల FHD +  SuperAMOLED డిస్ప్లేని 180Hz టచ్ శాంప్లింగ్ రేటుతో కలిగి ఉంటుంది. మోటో G60 మాత్రం కొంచెం పెద్దదైన 6.8- ఇంచ్ పరిమాణం కలిగిన FHD+ HDR 10 సపోర్ట్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేటుతో పాటుగా అదే పంచ్ హోల్ కెమేరా డిజైనుతో ఉంటుంది.      

Performance :

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల వీటి పెరఫార్మెన్స్ విషయంలో కూడా బేధం వుంది. ఎందుకంటే,ఈ రెండింటి ప్రాసెసర్ల గురించి చెప్పొచ్చు. రియల్మి 8 ప్రో ఒక 2.3 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 720G  ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వుంటుంది. అయితే, మోటో G60 మాత్రం 2.3 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732G తో వస్తుంది. ఇవి రెండు కూడా మంచి పవర్ ఎఫిషియంట్ మరియు గేమింగ్ ప్రొసెసర్లు.

వెనుక కెమేరా :

ఇక ఈ విభాగంలో ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఒకేవిధమైన కెమేరా ప్రత్యేకతలను కలిగి వున్నా సెన్సర్లలో కొంత మార్పు ఉంటుంది. రియల్మి 8 ప్రో మరియు మోటో G60 రెండు కూడా వెనుక భాగంలో 108 MP ప్రధాన కెమెరాని కలిగి ఉంటాయి. అయితే, రియల్మి 8 ప్రో మూడు  కెమెరాలతో ఉంటే, మోటో G60 మాత్రం మూడు కెమెరాలతోనే క్వాడ్ సెటప్ పనితనాన్ని అందిస్తుంది. Realme 8 Pro లో 108MP +8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2MP మ్యాక్రో మరియు 2MP B&W  సెన్సార్ ఉంటాయి. మోటో G60 లో 108MP +8MP అల్ట్రా వైడ్&మ్యాక్రో సెన్సార్ + 2MP డెప్త్ సెన్సార్ ఉంటాయి.

సెల్ఫీ కెమెరా :

ఈ విభాగంలో, ఈ  రెండింటి ఫోన్లలో చాలా వ్యత్యాసం వుంటుంది. రియల్మీ 8 ప్రో 16MP(f/2.45) సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ కెమెరా Sony IMX471 సెన్సార్ తో అందించింది. అయితే, మోటో G60 మాత్రం 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. రెండు ఫోన్లు కూడా పంచ్ హోల్ సెల్ఫీ డిజనుతోనే వస్తాయి.      

 బ్యాటరీ :

రియల్మీ 8 ప్రో ఒక 4500mAh బ్యాటరీ మరియు 50W సూపర్ డార్ట్ ఛార్జింగ్ యొక్క మద్దత్తుతో వుంటుంది. ఇక మోటో G 60 విషయానికి వస్తే, ఇది ఒక  పెద్ద 6000mAh బ్యాటరీని 20W టర్బో/క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4.0 మద్దతు ఇస్తుంది.

OS & సెక్యూరిటీ:

ఈ విభాగంలో, రియల్మీ 8 ప్రో స్మార్ట్ ఫోన్ తమ సొంత Realme UI 2.0 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 ఆధారితంగా పనిచేస్తుంది. ఇక మోటో G60 విషయానికి వస్తే, ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 11 తో ఎటువంటి బ్లోట్ వేర్ లేకుండా వుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo