కేవలం రూ.8,999 ధరలో వచ్చిన Realme 5i స్మార్ట్ ఫోన్

కేవలం రూ.8,999 ధరలో వచ్చిన Realme 5i స్మార్ట్ ఫోన్

రియల్మీ సంస్థ, ఈరోజు బడ్జెట్ ధరలో వెనుక 4 కెమెరాలతో తన సరికొత్త Realme 5i  స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. ఈ Realme 5i  యొక్క మొదటి  సేల్ జనవరి 15 మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. ఈ ఫోన్ కేవలం 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజి గల ఒకే వేరియంట్ తో మాత్రమే ఉంటుంది. ఇక ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ను Rs.8,999 తక్కువ ధరతో విడుదలచేసింది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 5i : ధర

1. Realme 5  (4GB + 64GB) ధర – Rs.8,999

Realme 5i :  ప్రత్యేకతలు

రియల్మీ సంస్థ,  ఈ Realme 5i స్మార్ట్ ఫోన్ ఒక 6.5 అంగుళాల మినీ డ్రాప్ డిజైన్ డిస్ప్లేతో వస్తుంది. ఈ అతి చిన్నని నోచ్ డిజైనులో,  సెల్ఫీల కోసం సెల్ఫీ కెమేరాని ఇందులో అందించింది.  అలాగే ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో అందించబడినది. ఈ స్మార్ట్ ఫోన్ 89 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. అలాగే, వెనుక భాగంలో సరికొత్తగా ఒక మిర్రర్ పాలిష్ రియర్ షెల్ డిజైన్ అందించింది. ఇందులో 10 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసరుతో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా, 2.0GHz వరకు క్లాక్ స్పీడును అందిస్తుంది దీని జతగా 4GB ర్యామ్ మరియు 364GB స్టోరేజి మరియు ఆక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ వంటి రెండు కలర్ ఎంపికలతో ఎంచుకోవచ్చు.

ఈ  స్మార్ట్ ఫోను యొక్క వెనుక భాగంలో ఒక క్వాడ్ కెమేరా సెటప్పును  అందించింది. ఒక ప్రధాన 12MP కెమేరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా ఇందులో ఇ వ్వబడింది. అలాగే, ఇది 8MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కి జతగా 2MP మాక్రో కెమేరా కలిగి ఉంది. ఈ కెమెరాలో అందించిన కెమేరాతో 10X డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ముందు కెమెరా విషయానికి వస్తే, 8 MP  సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఈ ఫోన్, కలర్ OS 6 స్కిన్ తో ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది.  

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile