రియల్ మీ 5G ఫోన్ పైన 15 వేల భారీ డిస్కౌంట్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 11 May 2021
HIGHLIGHTS
 • రియల్ మీ X50 ప్రో 5G స్మార్ట్ ఫోన్ పైన భారీ డిస్కౌంట్

 • ఫ్లిప్‌కార్ట్ నుండి 15 వేల భారీ డిస్కౌంట్ తో అమ్ముడవుతోంది.

 • Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి 10% తగ్గింపు కూడా లభిస్తుంది

రియల్ మీ 5G ఫోన్ పైన 15 వేల భారీ డిస్కౌంట్
రియల్ మీ 5G ఫోన్ పైన 15 వేల భారీ డిస్కౌంట్

రియల్మీ X50 ప్రో 5G ఇండియాలో 5G రెడీ తో విడుదలైన మొట్టమొదటి ఫోనుగా నిలుస్తుంది. అయితే, ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ నుండి 15 వేల భారీ డిస్కౌంట్ తో అమ్ముడవుతోంది. ఈ 5G స్మార్ట్ ఫోన్ వేగవంతమైన ప్రాసెసర్, డ్యూయల్ 5G టెక్నాలజీతో పాటుగా మంచి కెమెరా సెటప్ ను కూడా కలిగి వుంటుంది. లాంచ్ సమయంలో ఈ ఫోన్ యొక్క 8GB వేరియంట్ Rs.39,999 ధరతో ప్రకటించింది.

రియల్మీ X50 ప్రో 5G : అఫర్ ధర

1. Realme X50 Pro 5G : 8GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.24,999/-

2. Realme X50 Pro 5G : 12GB ర్యామ్ + 256GB స్టోరేజి : Rs.30,999/-

అధనంగా, Citi బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి 10% తగ్గింపు కూడా లభిస్తుంది. ఇది కాకుండా మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ఈ స్మార్ట్ ఫోన్ పైన అందించింది.    

రియల్మీ X50 ప్రో 5G : టాప్ -5 ఫీచర్స్

1. డిస్ప్లే

ఈ X50 ప్రో 5G స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లేని ప్రీమియం డిజైనుతో అందించింది. ఇందులో, డ్యూయల్ ఇన్ డిస్ప్లే కెమేరా (పంచ్ హోల్)తో పాటుగా AG గ్లాస్ టెక్నాలజీతో అందించింది. ఇది ఒక 6.44 అంగుళాల డిస్ప్లేని 3D AG కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ప్రొటెక్షన్ తో మరియు 20:9 ఆస్పెక్ట్ రేషియాతో తీసుకువచ్చింది. ఇక దీని డిస్ప్లే యొక్క స్పెషల్ ఫీచర్ విషయానికి వస్తే, ఇది HDR 10+ కి సపోర్ట్ చేయగల 90Hz డిస్ప్లేతో వస్తుంది. అంతేకాదు, ఇది 100% DCI-P3 మరియు 105% NTSC కలర్ గాముట్ తోపాటుగా 1000+ నిట్స్ బ్రైట్నెస్ వంటి గోప్ప ఫీచర్లతో వస్తుంది.                                            

2. ప్రాసెసర్

ఇది క్వాల్కామ్ యొక్క అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ అయినటువంటి, క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 865 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది A77 పెరఫార్మెన్స్  కోర్స్ తో గరిష్టంగా 2.84GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. PUBG వంటి గేమింగ్ అల్ట్రా హై డెఫీనేషనుతో పాటుగా ఎటువంటి అంతరాయం లేకుండా గంటల తరబడి ఆడవచ్చు.  ఈ స్మార్ట్ ఫోనులో అందించిన 5 డైమాన్షనల్ వేపర్ కూలింగ్ టెక్నలాజితో ఈ ఫోన్ను నిరంతరం చల్లగా ఉంచుతుంది. దీని విశేషం ఏమిటంటే, ఇది ఫోన్ను వేడికాకుండా చల్లబరచడంలో మంచి పాత్ర వహిస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది 5G సపోర్టుతో వస్తుంది మరియు ఇది ఇండియాలో విడుదలైన మొట్ట మొదటి 5G స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది. 

3. ర్యామ్ & స్టోరేజి

ఈ ఫోన్ ర్యామ్ వేరియంట్ ఎంపికలు : 8GB ర్యామ్ +128GB మరియు 12GB + 256GB స్టోరేజి . అంతేకాదు, ఇది వేగవంతమైన LPDDR5 RAM మరియు UFS 3.0 స్టోరేజ్ తో వస్తుంది.  

4. కెమేరా

ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును అందించింది. ఈ క్వాడ్ కెమెరాలో, f/1.8 ఎపర్చర్ కలిగిన ఒక 64MP ప్రధాన కెమెరాని Samsung ISOCELL GW1 సెన్సారుతో ఇంచింది. ఇక రెండవ కెమేరా గురించి చూస్తే, ఇది ఒక f/2.3 అపర్చరు కలిగిన 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మీకు మ్యాక్రో ఫోటోలను కూడా తియ్యడానికి వెలుపడుతుంది. దీనికి జతగా 12MP టెలిఫోటో లెన్స్ (20Xజూమ్) మరియు నాలుగవ కెమేరాగా ఒక 2MP బ్లాక్ %& వైట్ పోర్ట్రైట్ సెన్సార్ ని కలిగి ఉంటుంది.  ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 32MP Sony IMX616 సెన్సార్ మరియు 8MP సూపర్ వైడ్ యాంగిల్ సెన్సార్లు జతగా గల డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ కెమేరాతో మీరు సూపర్ సెల్ఫీ ఫోటోలు మరియు 120fps తో  స్లో మోషన్ వీడియోలను తీయ్యోచ్చు మరియు ఫోటోలను అద్భుతంగా చిత్రీకరించవచ్చు.

5. బ్యాటరీ

ఈ రియల్మీ X50 ప్రో 5G ఒక అతిపెద్ద 4,200mAh బ్యాటరీతో విడుదల చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క బ్యాటరీని అత్యంత వేగవంతమైన 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా, బాక్స్ లోనే ఒక 10V/6.5A ఛార్జర్ కూడా అందించింది. ఈ అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 20 నిముషాల్లో 60% వరకూ బ్యాటరీని ఛార్జ్ చెయ్యొచ్చు మరియు కేవలం 35 నిముషాల్లోనే ఫోన్ను పూర్తిగా ఛార్జ్ చెయ్యొచ్చు.     

Realme X50 Pro 5G Key Specs, Price and Launch Date

Price:
Release Date: 24 Feb 2020
Variant: 128 GB/6 GB RAM , 256 GB/12 GB RAM
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  6.44" (1080x2400)
 • Camera Camera
  64 + 8 + 12 + 2 | 32 + 8 MP
 • Memory Memory
  256 GB/12 GB
 • Battery Battery
  4200 mAh
logo
Raja Pullagura

email

Web Title: realme 5g phone available with huge discount on flipkart
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
₹ 10999 | $hotDeals->merchant_name
Redmi 9A (Sea Blue 3GB RAM 32GB Storage)| 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
Redmi 9A (Sea Blue 3GB RAM 32GB Storage)| 2GHz Octa-core Helio G25 Processor | 5000 mAh Battery
₹ 7499 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
Samsung Galaxy M31 (Ocean Blue, 8GB RAM, 128GB Storage)
₹ 16999 | $hotDeals->merchant_name
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
₹ 15499 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status